స్పీకర్ భోజన దౌత్యం
Published Thu, Feb 25 2016 11:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగేందుకు అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఫిబ్రవరి 26 (శుక్రవారం) అన్ని పార్టీల నాయకులను విందుకు ఆహ్వానించారు. ఇందులో మహాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మాల్వా ప్రాంత వంటకాలను వడ్డించనున్నట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి.
సోమవారం రాహుల్, టీఎంసీ పక్షనేత సుదీప్ బంద్యోపాధ్యాయతో భేటీ సందర్భంగా లోక్‌సభలో తమ గొంతు వినిపించే అవకాశం ఇవ్వాలని అలాగైతేనే రాజ్యసభలో ప్రభుత్వానికి సహకరిస్తామనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేదుకు ఈ భోజన దౌత్యానికి స్పీకర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
Advertisement