అండర్–19 చెస్ పోటీలు ప్రారంభం
Published Sat, Sep 10 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ స్టేషన్‌రోడ్డులోని మహేశ్వరి గార్డెన్స్ లో ఆకారపు రాజా చెన్న విశ్వేశ్వరరావు స్మారక అండర్–19 జిల్లా స్థాయి చెస్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెస్‌తో ఆలోచన శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయని, చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు చెస్‌లో శిక్షణ ఇప్పిం చడం మంచిదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీని వాస్, ఎండీ.ఆయుద్, చిప్ప వెంకటేశ్వర్లు, కుర్శీద్, కె.రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వహణ కార్యదర్శి బి.సంపత్ తెలిపారు. పోటీలకు ఆర్బిటర్లుగా భాస్కర్, అనిల్, రవి, రవీందర్, సునిల్‌లు వ్యవహరించారు. సాయంత్రం వరకు జరిగిన నాలుగు రౌండ్లలో జ్ఞానేశ్వర్, సాత్విక్, రితేష్, ఆశివ్, వర్శిత్, అల్లెన్‌థామస్, ఉదయ్‌కిరణ్‌లు గెలిచి ముందంజలో ఉన్నారని తెలిపారు.
Advertisement