chess competitions
-
ఇంకా ‘ఎత్తు’కు ఎదుగుతారు!
శ్రీకాకుళం : ప్రభుత్వం కాస్త ప్రోత్సహిస్తే చెస్ క్రీడాకారులు మరింత ఎత్తుకు ఎదుగుతారని ఏపీ రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.డి రామారావు, ప్రధాన కార్యదర్శి కేవీ సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలో చెస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, దాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా చెస్ అసోయేషన్, కార్తికేయ స్పోర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని న్యూసెంట్రల్ స్కూల్ వేదికగా జరుగుతున్న రెండురోజుల ఏపీ రాష్ట్రస్థాయి అండర్–7, సీనియర్ మహిళల చెస్ చాంపియన్‌షిప్ పోటీల కార్యక్రమానికి వారు హాజరయ్యారు. పోటీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వైడి రామారావు, కేవీ సుబ్రహ్మణ్యంలను ‘సాక్షి’ పలకరించింది. రాష్ట్రంలో చెస్ క్రీడల పురోగతి, ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాల గురించి వారు ఇలా వివరించారు. విశాఖలోప్రతిష్టాత్మకంగా పోటీలు:రామారావు విశాఖపట్నంలో మే 4 నుంచి 12 వరకు ఆలిండియా అండర్–13 బాలబాలికల చెస్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నాం. విశాఖలోని వుడా చిల్డ్రన్స్ థియేటర్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ చెస్ క్రీడాకారులు అద్భుతంగా ఆడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ చెస్ క్రీడా ఎంపికలు, పోటీలు జరుగుతున్నాయి. ఆదరణ కూడా అదే రీతిలో ఉంది. రాష్ట్రం నుంచి కనీసం 10 మంది గ్రాండ్మాస్టర్లను తయారుచేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం, సహాయం అందితే మరిన్ని పోటీలను రాష్ట్రంలో నిర్వహిస్తాం. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. శిక్షణ శిబిరాలు విస్తృతం:కేవీ సుబ్రహ్మణ్యం రాష్ట్రంలో మున్ముందు శిక్షణ శిబిరాలను మరింతగా విస్తృతం చేస్తాం. రాష్ట్రంలో చెస్ క్రీడకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. క్షేత్రస్థాయిలో అనగా మండల, నియోజకవర్గస్థాయిలో చెస్పోటీలను నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల సంఘ నాయకులకు దిశానిర్దేశం చేశాం. కొన్నిచోట్ల పోటీలను నిర్వహిస్తున్నారు. గత ఏడాది రష్యాకు చెందిన చెస్ గ్రాండ్‌మాస్టర్, కోచ్ అమనుటోవ్ను రాష్ట్రానికి తీసుకొచ్చాం. అతని పర్యవేక్షణలో విజయవాడ, గుంటూరు వేదికల్లో నిర్దేశించిన క్రీడాకారులకు తర్ఫీదు ఇప్పించాం. త్వరలో రాష్ట్రంలో చెస్ క్రీడాకారులను ఎన్రోల్ చేయనున్నాం. రాష్ట్రంలో ఎంతమంది చెస్క్రీడాకారులు ఉన్నారనే విషయం సుస్పష్టం అవుతుంది. క్రీడాపాలసీపై అవగాహన లేదు.. రాష్ట్రంలో శాప్ ప్రవేశపెట్టిన క్రీడాపాలసీ బాగుంది. అయితే చెస్‌తోపాటు మిగిలిన సంఘాల నాయకులకు దానిపై పూర్తిస్థాయిలో అవగాహన లేదు. అవగాహన కల్పించేందుకు శాప్ కూడా అవసరమైన చర్యలు తీసుకోలేదు. చెస్ కాస్ట్లీ గేమ్, రాష్ట్ర చెస్ సంఘంలో అందరూ బాధ్యత తీసుకుకోవాలి. సమష్టిగా ముందుకు వెళ్తేనే విజయాలు అందుతాయి. తద్వారా పిల్లల నుంచి మంచి ఫలితాలు వస్తాయి. 2016లో రాజమండ్రిలో అండర్–19, 2017లో విజయవాడలో అండర్–7 జాతీయస్థాయి పోటీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగ్విజయంగా ముగించాం. శ్రీకాకుళంలో ఐదారేళ్లుగా రాష్ట్రస్థాయి చెస్‌పోటీలు జరుగుతుండడం శుభ పరిణామం. ఇక్కడ సంఘ కార్యదర్శి భీమారావు చెస్ అభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారు. మూడు నెలల్లో నేషనల్ రేటింగ్స్ టోర్నీ శ్రీకాకుళం వేదికగా జరుగుతుంది. -
అండర్–19 చెస్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ స్టేషన్‌రోడ్డులోని మహేశ్వరి గార్డెన్స్ లో ఆకారపు రాజా చెన్న విశ్వేశ్వరరావు స్మారక అండర్–19 జిల్లా స్థాయి చెస్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెస్‌తో ఆలోచన శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయని, చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు చెస్‌లో శిక్షణ ఇప్పిం చడం మంచిదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీని వాస్, ఎండీ.ఆయుద్, చిప్ప వెంకటేశ్వర్లు, కుర్శీద్, కె.రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వహణ కార్యదర్శి బి.సంపత్ తెలిపారు. పోటీలకు ఆర్బిటర్లుగా భాస్కర్, అనిల్, రవి, రవీందర్, సునిల్‌లు వ్యవహరించారు. సాయంత్రం వరకు జరిగిన నాలుగు రౌండ్లలో జ్ఞానేశ్వర్, సాత్విక్, రితేష్, ఆశివ్, వర్శిత్, అల్లెన్‌థామస్, ఉదయ్‌కిరణ్‌లు గెలిచి ముందంజలో ఉన్నారని తెలిపారు. -
ఆత్మవిశ్వాసంతోనే విజయం
శ్రీకాకుళం: విద్యార్థులకు చదువు, క్రీడలు రెండూ ముఖ్యమేనని, ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చునని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావునాయుడు అన్నారు. స్థానిక స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీలో జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 116వ ఓపెన్ చెస్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో డీఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మెదడుకు మేత చదరంగం క్రీడతోనే సాధ్యమన్నారు. ఏ రంగంలోనైనా రాణించడానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముఖ్యమని చెప్పారు. విద్యార్థులు, యువత చెడువ్యసనాల జోలికిపోవద్దని, ఆరోగ్యంగా ఉండేందుకు వ్యా యామం, క్రీడలను అలవాటుగా మార్చుకోవాలని సూచిం చారు. పోటీల్లో 66 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. కార్యక్రమంలో చెస్ కోచ్ భేరి చిన్నారావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజేతగా హరీష్... ఇదిలా ఉండగా ఓపెన్ చెస్ టోర్నీ విజేతగా అంధవరపు హరీష్ మణికంఠ నిలిచాడు. బాలికల్లో టి.షాలిని జయభేరి మోగించింది. వివిధ వయో విభాగాల్లో ఆ తరువాతి స్థానా ల్లో ఎన్డీఎస్ఎల్ కార్తికేయ, సురేష్, పొట్నూరు నిఖిత, బీవీ ధీరసమీర్, ఎ.సింధు, కర్రి శ్రీవిద్య, పి.హరిగోపాల్, బమ్మిడి సాయిహర్ష, వై.విష్ణు, ఐ.కళ్యాణచక్రవర్తి విజేతలు గా నిలిచారు. అలాగే, ఎన్.దుర్గారాణి, టి.మోహన్సాయి, బి.రాహుల్, ఎం.కౌముది, వైభవ్, సాయిసూర్యధనుష్, అమితోష్, పి. తనూశ్రీ, పి. అరుణ్, కార్తికేయ, జె. సత్యానంద్, సాయిశ్రీ, డి.రోషిణి, పి. రామకృష్ణ, ఆర్. శ్రీనివాసనాయుడు, పి. మోక్షజ్ఞ, ఎస్. కిరణ్‌రాజ్, కె.సాయికళ్యాణ్ రాణించారు. -
జిల్లాస్థాయి చెస్ పోటీలు
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: కింగ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నల్లగొండ పబ్లిక్ స్కూల్లో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. పోటీలను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధాశక్తిని, ఓపిక, సహనాన్ని పెంపొం దించే చెస్‌ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. క్రీడల నిర్వహణకు ట్రస్మా సహకరిస్తుందని తెలిపారు. ఉత్తమ క్రీడాకారుడి పేరు చిరస్థాయిగా ఉంటుందని, మరుగునపడిపోని గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజర్లు ఎం.విశ్వప్రసాద్, వి.మట్టయ్య, జరీఫొద్దీన్ పాల్గొన్నారు. కాగా జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. మొదటి 10 స్థానాల్లో రవికుమార్(హుజూర్నగర్), పీవీ ఎస్ అరవింద్(మిర్యాలగూడ), బి.సత్యనారాయణ(కోదాడ) వి.మట్టయ్య(నల్లగొండ), బి.సంజయ్‌భార్గవ్(మిర్యాలగూడ), మేడం పవన్‌తేజ(నల్లగొండ), బి.భానుమహేశ్(సూర్యాపేట), సిహెచ్.మహేశ్(నల్లగొండ), ఎస్కె.బర్షిత్(హాలియా) పి.మధుసూదన్(నల్లగొండ) నిలిచారు. అలాగే బెస్ట్ మహిళా విజేతగా ఎం.అలేఖ్య(నల్లగొండ), అండర్గ్రూప్స్లో మరో 20 మంది బాల, బాలికలకు బహుమతులు, మెమోం టోలు అందజేశారు.