శ్రీకాకుళం: విద్యార్థులకు చదువు, క్రీడలు రెండూ ముఖ్యమేనని, ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చునని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావునాయుడు అన్నారు. స్థానిక స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీలో జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 116వ ఓపెన్ చెస్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో డీఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మెదడుకు మేత చదరంగం క్రీడతోనే సాధ్యమన్నారు. ఏ రంగంలోనైనా రాణించడానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముఖ్యమని చెప్పారు. విద్యార్థులు, యువత చెడువ్యసనాల జోలికిపోవద్దని, ఆరోగ్యంగా ఉండేందుకు వ్యా యామం, క్రీడలను అలవాటుగా మార్చుకోవాలని సూచిం చారు. పోటీల్లో 66 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. కార్యక్రమంలో చెస్ కోచ్ భేరి చిన్నారావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విజేతగా హరీష్...
ఇదిలా ఉండగా ఓపెన్ చెస్ టోర్నీ విజేతగా అంధవరపు హరీష్ మణికంఠ నిలిచాడు. బాలికల్లో టి.షాలిని జయభేరి మోగించింది. వివిధ వయో విభాగాల్లో ఆ తరువాతి స్థానా ల్లో ఎన్‌డీఎస్‌ఎల్ కార్తికేయ, సురేష్, పొట్నూరు నిఖిత, బీవీ ధీరసమీర్, ఎ.సింధు, కర్రి శ్రీవిద్య, పి.హరిగోపాల్, బమ్మిడి సాయిహర్ష, వై.విష్ణు, ఐ.కళ్యాణచక్రవర్తి విజేతలు గా నిలిచారు. అలాగే, ఎన్.దుర్గారాణి, టి.మోహన్‌సాయి, బి.రాహుల్, ఎం.కౌముది, వైభవ్, సాయిసూర్యధనుష్, అమితోష్, పి. తనూశ్రీ, పి. అరుణ్, కార్తికేయ, జె. సత్యానంద్, సాయిశ్రీ, డి.రోషిణి, పి. రామకృష్ణ, ఆర్. శ్రీనివాసనాయుడు, పి. మోక్షజ్ఞ, ఎస్. కిరణ్‌రాజ్, కె.సాయికళ్యాణ్ రాణించారు.
ఆత్మవిశ్వాసంతోనే విజయం
Published Mon, May 30 2016 12:17 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement