- ‘గురుకుల’రాష్ట్రస్థాయి అకడమిక్ మీట్‌ను ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి
లేపాక్షి: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికే రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని మహాత్మా జ్యో తిరావు పూలే బీసీ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. బుధవా రం ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి అకడమిక్ మీట్ 2016–17 పోటీలను ఆయన ప్రారంభించారు.
ఆ యన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు లేపాక్షిలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. లేపాక్షి దేవాలయ చరిత్ర దేశస్థాయిలో పేరుగాంచినదని ఇలాంటి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అదృష్టంగా భావించాలన్నారు. మొత్తం 13 జిల్లాల నుంచి 32 పాఠ శాలలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన, వక్తృ త్వపు, పె యింటింగ్స్, క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి లేపాక్షి ప్రిన్సిపల్ వాదిరాజు అధ్యక్షత వహించగా టేకులోడు, నసనకోట, పేరూరు, ప్రిన్సిపాళ్లు ప్రసాద్, సంగీతకుమారి, సంజీవరావు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎంపీపీ హనోక్, జెడ్పీటీసీ ఆదినారాయణరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెరుగైన విద్యను అందిస్తాం
అనంతరం ఎంజేపీఏపీ బీసీ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ విలేకరులతో మాట్లాడారు. రాష్టం లోని మహాత్మా జ్యోతిరావుపూలే ఏపీ గురుకుల పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 2015–16 సంవత్సరానికి 32 పాఠశాలలకు గానూ 17 పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు సాధించగా 15 పాఠశా లల్లో 97 శాతం ఫలితాలు సాధించామన్నారు. జి ల్లాలో నసనకోట, గుడిబండ, గుండుమల, రాయదుర్గం ప్రాంతాల్లో ఎంజేపీఏపీ విద్యాలయాలు మంజూరు అ య్యాయని, నసనకోట మినహా మిగిలిన మూడింటికి సిబ్బంది కొరతతో పనిచేయలేదన్నారు.