సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం | Softboll tournament begin | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

Published Sat, Jul 23 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

Softboll tournament begin

మాచర్ల: విద్యార్థులు విద్యనభ్యసించటంతో పాటు అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. శనివారం స్థానిక సెయింట్‌ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో పునీత అన్నమ్మ పేరుతో నిర్వహిస్తున్న  జిల్లాస్థాయి సాప్ట్‌బాల్‌ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వెనుకబడిన పల్నాటిలో సెయింట్‌ ఆన్స్‌ విద్యాసంస్థ ఉత్తమ బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. ఆర్సీఎం చర్చి పాస్టర్‌ పెట్ల మరియదాసు, ఎంఈవో వేముల నాగయ్య, జిల్లా సాప్ట్‌బాల్‌ కార్యదర్శి నరసింహారెడ్డికి పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. పోటీల్లో జిల్లా నుంచి వచ్చిన 14 టీంలు పాల్గొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement