MLA prk
-
బంగారంపై ఆంక్షలు అమానుషం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల : లక్షలాది మంది బాధతో పెడుతున్న కన్నీటి ప్రవాహంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బంగారంపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమానుషమని తెలిపారు. ఇప్పటికే నోట్ల రద్దు విషయంలో పేద, మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడ్డారన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు బ్యాంక్‌ల వద్ద క్యూలో నిలబడలేక ఇబ్బందులు పడుతుంటే టీడీపీ నాయకులు అంతా మంచి జరుగుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కష్ట పడి సంపాదించుకుని దాచుకున్న డబ్బులతో మహిళలు బంగారం కొనుక్కుంటే వాటికి కూడా లెక్కలు చూపించాలని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బడా బాబులను పట్టించుకోకుండా వారందరూ ముందుగానే సర్దుకునే విధంగా వ్యవహరించిన ప్రభుత్వం సామాన్య మహిళలు, పేదలను కన్నీరు పెట్టించే విధంగా వ్యవహరించడం హేయమని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి వారికి వైఎస్సార్ సీపీ అండగా నిలబడి వారి తరపున పోరాటం చేస్తామన్నారు. -
టీడీపీ ఆగడాలను ఎండగడతా..
వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల: అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అవకాశం వస్తే పల్నాడులో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, మాఫియా ఆగడాలు, అక్రమాల తీరుపై ప్రస్తావిస్తానని వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. పల్నాడులో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులను అడ్డంపెట్టుకొని చేస్తున్న అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా మాట్లాడతానన్నారు. ప్రత్యేకహోదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అధికార పార్టీ వారు రాజీపడి సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ప్రజలను మోసగిస్తున్న విధానాన్ని ఎండగడతానన్నారు. -
ఎమ్మెల్యే పీఆర్కేకు మైలేజీ..
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం బహిరంగ చర్చ నుంచి యరపతినేని తప్పించుకున్న తీరుపై సర్వత్రా విమర్శలు మాచర్ల : పల్నాడులో తీవ్ర ఉత్కంఠ రేపిన సవాళ్లు, ప్రతి సవాళ్ల వ్యవహారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిష్టను పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయానికి వచ్చారు. పోలీసుల సహాయంతో ఛాలెంజ్‌కు వెనుకంజ వేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. రెండు వారాల కిందట యరపతినేని అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తిన పీఆర్కేకి ప్రతి సవాల్ విసిరి, దేనికైనా సిద్ధమని చెప్పి యరపతినేని సోమవారం పీఆర్కేను హౌస్ అరెస్టు చేయించిన అనంతరం పిడుగురాళ్లలో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తనపై పోటీ చేయమని సవాల్ విసిరానని చెప్పడం ద్వారా ప్రస్తుతం ఉప ఎన్నికలకు తాను సిద్ధం కాదని స్పష్టం చేశారని, తద్వారా ఛాలెంజ్‌కు వెనుకంజ వేశారని పలువురు చెప్పుకుంటున్నారు. ఆధారాలు తీసుకు రావాలని వేదిక, తేదీ చెప్పిన యరపతినేని తీరా అసలు సమయానికి ఏదో సాకుచెప్పి పోలీసులను అడ్డంపెట్టుకుని శాంతి భద్రతల పేరుతో చర్చా వేదిక జరగకుండా తప్పించుకున్నారని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. చర్చ జరిగితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే పక్కా ప్రణాళికతో పీఆర్కే ముందస్తుగా అరెస్టులు చేయించేందుకు యరపతినేని నానా తంటాలు పడ్డారు. ఇప్పటి వరకు దాచేపల్లిలోని పేకాట క్లబ్ నిర్వహణ, రేషన్ అక్రమ వ్యాపారం గురించి ఎక్కడా మాట్లాడకపోవడం గమనిస్తే వీటిలో ఆయన పాత్ర ఉండడం వల్లే మాట్లాడడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఉన్నా కేవలం సరస్వతి భూములకు సంబంధించి తమకు అనుకూలంగా ఉన్న కొంత మంది చేత మాట్లాడించి అనుకూల మీyì యాలో వివిధ కథనాలు రాయించుకుని, తన హవా చాటుకోవాలని ప్రయత్నం చేసినా, చివరికి చర్చ జరుగకుండా బయటపడేందుకు యరపతినేని నానా తంటాలు పడ్డారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో పీఆర్కే తాను చేసిన సవాల్‌కు చివరి వరకు నిలబడి ఆధారాలతో నిరుపించేందుకు సిద్ధమై ప్రజల మెప్పు పొందగా, యరపతినేని మాత్రం కుంటి సాకులతో వెనుకంజ వేసి డ్యామేజ్ అయ్యారని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
పల్నాడులో ఉత్కంఠ
* పీఆర్కే, యరపతినేని చాలెంజ్ * నేడు నడికుడి వెళ్లనున్న పీఆర్కే * 144వ సెక్షన్ విధించిన పోలీసులు * నేటి ఉదయం నుంచి అమలు * ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి.. మాచర్ల : వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సవాళ్ల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. యరపతినేని అధికారంలోకి వచ్చినప్పటినుంచి అక్రమాలు చేస్తూ అనేకమందిని బెదిరించి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ పీఆర్కే ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఈ నెల 29న నడికుడిలో ఈ వివరాలు వెల్లడిస్తానని సవాల్ చేయగా, రమ్మని యరపతినేని సవాల్ చేసిన విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం వందలాదిమంది కార్యకర్తలతో నడికుడి వెళ్లేందుకు పీఆర్కే సిద్ధమవుతున్నారు. మరోపక్క శనివారం మాచర్లలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలీసు బందోబస్తు నడుమ వచ్చిన యరపతినేని ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయనే ఆరోపణకే పరిమితమై వెళ్లిపోయారు. ముందస్తు అరెస్టులకు ఏర్పాట్లు... పీఆర్కేను అడ్డుకునేందుకు ఆయన ముఖ్య అనుచరులందరినీ అరెస్టు చేయించేందుకు యరపతినేని రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆదివారం రాత్రికే వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క మాచర్ల నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి 144వ సెక్షన్ అమలులో ఉన్నట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ముందుగా పోలీసులు తహశీల్దారు వెంకటేశ్వర్లును అనుమతి కోరగా, దీనిపై స్పందించిన ఆయన సోమవారం వచ్చి ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. సెప్టెంబర్ ఐదున జరగనున్న వినాయక చవితి వేడుకలను సాకుగా చూపి పోలీసులు ఈ అనుమతులు కోరినట్లు తెలిసింది. దీనిపై తహసీల్దార్ వెంకటేశ్వర్లును ఫోన్లో వివరణ కోరగా, 144 సెక్షన్‌ను ఆదివారం మధ్యాహ్నం నుంచి అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులు తనను ఫోనులో కోరారని, ప్రస్తుతం తాను అందుబాటులో లేకపోవడం వల్ల సెక్షన్ అమలు తెచ్చుకొమ్మని చెప్పానని వివరించారు. సోమవారం ఉదయం 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులపై సంతకం చేస్తానని చెప్పారు. -
వేధింపులు.. బెదిరింపులు
పార్టీ మారకపోతే కేసుల్లో ఇరికిస్తామంటూ హెచ్చరికలు నేరుగా పోలీసు అధికారుల ఒత్తిళ్లు వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు వైఎస్సార్సీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపిన మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సవాల్ సాక్షి, గుంటూరు : పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకో.. దాచుకో అన్నచందంగా గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేత అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తన, మన భేదం లేకుండా సొంత పార్టీ నేతలకు చెందిన మద్యం దుకాణాలు, సున్నపు బట్టీల వద్ద సైతం భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారు. సొంత భూములు ఉన్నవారి వద్ద నుంచి మైనింగ్ లైసెన్సులను సైతం లాగేసుకుని అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. దీనిపై స్పందించిన లోకాయుక్త విచారణ జరిపి అక్రమ మైనింగ్ వాస్తవమేనంటూ నిర్ధారించింది కూడా. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడం దారుణమైన విషయం. మరోపక్క పలువురు పోలీసు అధికారులు ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ నాయకులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. పార్టీ మారకపోతే తప్పుడు కేసులు పెడతామంటూ నేరుగా పోలీసు అధికారులే బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలను ఇదేవిధంగా బలవంతంగా టీడీపీలో చేరేలా ఒత్తిళ్లు చేశారు. తప్పుడు కేసులు, బెదిరింపులు.. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన గురువాచారిని సైతం తప్పుడు కేసుల్లో ఇరికించిన అధికార పార్టీ నేతలు.. పోలీసుల ద్వారా ఆయన్ను నాలుగు రోజులపాటు ఎవరికి కనిపించకుండా చేసి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడి చివరికి పార్టీ కండువా కప్పేశారు. గ్రామాల్లో అధికార పార్టీపై సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో రగిలిపోతుండటంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నుంచి గ్రామ స్థాయి నాయకులు వలసలు వస్తున్నారంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకునేందుకు పథక రచనలు చేస్తున్నారు. ఇప్పటికే పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో అనేక గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వేధింపులు తట్టుకోలేక ఇష్టం లేకున్నా పలువురు పచ్చ జెండా కప్పుకొంటుండగా, అనేక గ్రామాల్లో మాత్రం ఎన్ని వేధింపులకు గురిచేసినా తాము వైఎస్సార్సీపీని వీడేది లేదంటూ కరాఖండీగా చెబుతుండటంతో అధికార పార్టీ నేతకు దిక్కుతోచడం లేదు. అంతర్మథనంలో టీడీపీ శ్రేణులు.. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్లు, రోడ్ల నిర్మాణాల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని, ఆ విషయాన్ని ఆధారాలతో రుజువు చేస్తానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పల్నాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. ఇప్పటివరకు గ్రామాల్లో భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధపడితే తాను గురజాల నుంచి పోటీ చేస్తానని, ఎవరు ఓడినా రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ ఎమ్మెల్యే పీఆర్కే సవాల్ విసరడం పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపింది. దీనిపై యరపతినేని వెనకడుగు వేస్తుండటంపై టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పుడున్న పరిస్థితుల్లో గురజాల నియోజకవర్గంలో గెలవడం సాధ్యమైన పని కాదని టీడీపీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 29న నడికుడి మార్కెట్ యార్డుకు వచ్చి యరపతినేని అవినీతి బాగోతాన్ని బయటపెడతానని ప్రకటించిన ఎమ్మెల్యే పీఆర్కే.. అందుకు సిద్ధమవుతుండటంతో దీన్ని నుంచి బయటపడేందుకు పోలీసుల ద్వారా పథక రచన చేస్తున్నట్లు తెలిసింది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే సాకుతో ఎమ్మెల్యే పీఆర్కేను, వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించే ఆలోచనలో ఎమ్మెల్యే యరపతినేని ఉన్నట్లు సమాచారం. -
ఎమ్మెల్యే యరపతినేనిపై పోటీకి సిద్ధం
ఓడిపోతే రాజకీయ సన్యాసానికి రెడీ: ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల రూరల్: అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా భూదందాలు, అవినీతి, దౌర్జన్యాలు చేస్తూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అవినీతిని ఎండగట్టేందుకు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికలలో గురజాల నుంచి పోటీ చేస్తానని, ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవటానికి సిద్ధమేనా అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాలు విసిరారు. మంగళవారం మాచర్ల మండలంలోని ఏకోనాంపేట గ్రామ కృష్ణానది తీరంలో పుష్కర స్నానమాచరించి అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుష్కరఘాట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని, తాను చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ... టీడీపీ నేతల అవినీతిని చెప్పమని సవాలు విసిరిన నాయకుల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, నీకు దమ్ము, ధైర్యం ఉంటే గురజాల, సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాలలో నీవు చేసిన అక్రమాలు, అన్యాయాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు. గురజాల ఎమ్మెల్యే ద్వారా నష్టపోయిన బాధితులంతా వ్యక్తిగతంగా తనకు చెప్పారని, ఆయన∙అవినీతి ఆధారాలతో సహా తనవద్ద ఉన్నాయన్నారు. పుష్కరఘాట్ల పార్కింగ్‌లలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, అంతేకాకుండా అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద అనధికారికంగా లారీల నుంచి వేలాది రూపాయలను వసూలు చేస్తూ లక్షల రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు. సిమెంట్ పరిశ్రమ కోసం చెన్నాయపాలెంలో మా పార్టీకి చెందిన వారు డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ భూములను కొనుగోలు చేస్తే, కొన్న భూములను ఆక్రమించారని చేసే డ్రామాలపై మాట్లాడటానికి వెళ్తే ఏదో జరిగిందని హడావుడి చేసి పెట్రోల్ బాంబులు, కర్రలతో దాడి చేసి అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలను చూస్తూ ఊరుకోమని, ప్రజా ఉద్యమంతో వారి ఆగడాలను అడ్డుకుంటామన్నారు. అవినీతి అక్రమాలతో పుష్కరఘాట్ల నిర్మాణం జరిపి ప్రజాధనాన్ని దోచుకున్న తీరుకు నిరసనగానే తెలంగాణ ఘాట్‌లో స్నానమాచరించానని, ఎవరు దైవ భక్తులో, ఎవరు పల్నాటి ప్రజల రక్తాన్ని తాగుతున్నారో ప్రజలందరికీ తెలుసుననిఅన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు తాడి వెంకటేశ్వరరెడ్డి, యరబోతుల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బండారు పరమేశ్వరరావు, కుర్రి సాయిమార్కొండారెడ్డి, తురకా కిషోర్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, పాపిరెడ్డి, బూడిద శ్రీను, చిట్టేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా సాధించిన ఘనత ?
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల : వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు శుభం జరుగుతుందని కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ప్రచారం చేసుకుని మీరు సాధించింది కేవలం రూ.1,976 కోట్లేనా అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇదిగో ప్రత్యేక హోదా వచ్చేస్తోంది.. బీజేపీ మా మిత్రపక్షం... రాష్ట్రానికి న్యాయం జరుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. రెండు వారాల నుంచి పార్లమెంట్లో ౖవైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే వారంరోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పిన కేంద్రమంత్రి అరుణŠ జైట్లీ హోదా గురించి మాట్లాడకుండా అరకొర నిధులు ఇచ్చినా టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్టు నటిస్తూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. ఐదు కోట్ల మంది ఆకాంక్షలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కేవలం నామమాత్రంగా నిధులు విదిలించి చేతులు దులుపుకొందన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
సాగర్ కుడికాలువకు నీరు విడుదల చేయాలి
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల : నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలోని రైతుల పంటలను కాపాడేందుకు నీటి విడుదలను కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి ఆయన గురువారం రాత్రి ఆయన సాక్షితో ఫోన్లో మాట్లాడారు. రెండేళ్లుగా సాగర్ కుyì lకాలువ రైతులు నీటి కొరతతో పంటలు సరిగా పండించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి నెలకొన్నందున సాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరిగిందన్నారు. ఇప్పటికీ సాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కృష్ణా బోర్డు అధికారులతో చర్చించి కుడికాలువ పరిధిలోని రైతులకు పంట నీరు అందించాలని ఆయన కోరారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
పుష్కరాలను అపవిత్రం చేయొద్దు..
భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు.. నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ జరపాలి ఎమ్మెల్యే పీఆర్కే సత్రశాల (రెంటచింతల): ‘పవిత్ర కృష్ణాపుష్కరాలకు పార్టీ రంగు పులమడం ఎందుకు... భక్తుల మనోభావాలను గౌరవించాలనే జ్ఞానం లేదా.. నేను పచ్చరంగు వేసిన ఘాట్లలో పుష్కరస్నానం చేయను.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి’ అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పీఆర్కే సోమవారం సత్రశాలలో పుష్కరఘాట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలను సైతం టీడీపీ వారు పసుపుమయం చేసి అపవిత్రం చేశారని మండిపడ్డారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తోందని, కాని వారి పార్టీ రంగు వేసుకోలేదన్నారు. అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పుష్కరపనులలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పుష్కరాల ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాలను సైతం అధికారపార్టీ నాయకులు ఇష్టానుసారం కబ్జా చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే పీఆర్కేకు దేవస్థానం చైర్మన్ గోవర్ధన్,ఈవో అనిత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానంలో ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పూజల రామయ్య, ఏరువ శౌరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి శొంఠిరెడ్డి నల్ల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బోర్ల తవ్వకానికి శంకుస్థాపన
సొంత నిధులు రూ.5 లక్షలతో బోర్ల ఏర్పాటు మాచర్ల: పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం సొంత ఖర్చుతో ఐదుబోర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నా.. అందులో భాగంగానే గురువారం రాత్రి చెన్నకేశవకాలనీలో బోర్ వేయించా, 7, 9 వార్డులలో బోర్లు తవ్విస్తున్నాం.. మరో మూడుచోట్ల బోర్లు వేయాల్సి ఉందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం వివిధ ప్రాంతాలలో మంచినీటి బోర్ల తవ్వకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చినమాట ప్రకారం రూ.5 లక్షలు వెచ్చించి శివారు కాలనీలో బోర్లు తవ్విస్తున్నామని చెప్పారు. 9వ వార్డులో బోరు తవ్వకం పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ 9వ వార్డుకు చెందిన కృష్ణబలిజ సంఘం నాయకులు పండ్ల అంజిబాబు, ఆంజనేయులు, శ్రీనివాసరావు, జి.హనుమంతరావు, వైఎస్సార్సీపీ నాయకులు షేక్ కరిముల్లా, మరియమ్మ, మెట్టు శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బోయ రఘురామిరెడ్డి, షేక్ కరిముల్లా పాల్గొన్నారు. సాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలి.. మంచినీటి అవసరాల కోసం రెండువారాలకుపైగా సాగర్ కుడికాలువకు ప్రభుత్వం నీటిని విడుదల చేయటానికి అంగీకరించటం వల్ల మంచినీటి సమస్య పరిష్కారం లభించినట్లయిందని ఎమ్మెల్యే పీఆర్కే అన్నారు. పురపాలక అధికారులు భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తకుండా ఎక్కువ మోటార్లతో ఈ 15 రోజుల వ్యవధిలో క్వారీని నింపితే నీటిఎద్దడి సమస్య తలెత్తే అవకాశం లేదన్నారు. -
సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం
మాచర్ల: విద్యార్థులు విద్యనభ్యసించటంతో పాటు అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. శనివారం స్థానిక సెయింట్‌ఆన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పునీత అన్నమ్మ పేరుతో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సాప్ట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వెనుకబడిన పల్నాటిలో సెయింట్ ఆన్స్ విద్యాసంస్థ ఉత్తమ బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. ఆర్సీఎం చర్చి పాస్టర్ పెట్ల మరియదాసు, ఎంఈవో వేముల నాగయ్య, జిల్లా సాప్ట్‌బాల్ కార్యదర్శి నరసింహారెడ్డికి పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. పోటీల్లో జిల్లా నుంచి వచ్చిన 14 టీంలు పాల్గొన్నాయి. -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ శ్రేణులు
ఎమ్మెల్యే పీఆర్కే సమక్షంలో పార్టీలో చేరిన యువకులు మాచర్ల: రెంటచింతలకు చెందిన రైలుపేట, ఆంజనేయస్వామి మాణ్యానికి చెందిన 75 మంది టీడీపీ సభ్యులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యులు మోర్తాల ఉమామహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ ఎమ్మెల్యే పీఆర్కే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంతమంది నాయకులు పోయినా నష్టమేమీ లేదని, బలమైన కార్యకర్తలు,వైఎస్సార్ అభిమానులు ఉన్న వైఎస్సార్సీపీ బలహీనపడే ప్రసక్తే లేదన్నారు. ప్రలోభాలకు గురయ్యే నాయకులు మినహా ప్రజలంతా వైఎస్సార్సీపీకే మద్దతు పలుకుతున్నారని ఎమ్మెల్యే పీఆర్కే చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. పార్టీలో చేరిన దవిశెట్టి శ్రీనివాసరావు, షేక్ గౌస్, షేక్‌వలి, చింతపల్లి శివ, రాములు, జక్కల శ్రీను, గుదె రాములు, బాలు, సాగర్, దండే శ్రీనివాసరావు, రాముడు, పుల్లా ఫ్రాన్సిస్, మహేష్, అశోక్, మహేష్‌నాయుడు, మందపాటి చినశ్రీను, వేముల కళ్యాణ్, నంబూరి రాముడుతోపాటు పలువురు యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ పూజల రామయ్య, ఏరువ శౌరెడ్డి, సర్పంచ్ గుర్రాల రాజు, ఏలూరి సత్యం, ఎంపీటీసీ రామాంజనేయరెడ్డి, జిల్లా కార్యదర్శి జూలకంటి వీరారెడ్డి, యూత్ కన్వీనర్ తురకా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
వెన్నుపోట్లు పొడవడమే క్యారెక్టరా..?
చంద్రబాబును ప్రశ్నించిన ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల : క్యారెక్టర్ కలిగి ఉండడమంటే సొంత మామకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో అధికారంలోకి రావడమేనా అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను క్యారెక్టర్ కలిగిన వ్యక్తినని సీఎం చంద్రబాబు చెప్పుకోవడంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న చంద్రబాబు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మామ ఎన్టీఆర్ వద్ద చేరి,చివరకు ఆయనకే వెన్నుపోటు పొడిచారన్నారు. తన వెంట వచ్చిన హరికృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావులను ఆరు నెలల్లో వదిలించుకొని వారికి సైతం తన వెన్నుపోటు ఎలా ఉంటుందో చూపించారన్నారు. వైస్రాయి హోటల్లో క్యాంప్ నిర్వహించి ఎమ్మెల్యేలను బంధించి అధికారం చేపట్టిన వ్యక్తి, ఇప్పుడు ప్రజలకు ఏమీ తెలియదన్నట్లు తనకు తాను సచ్చీలుడుగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం, రాష్ట్రంలో అవినీతి అక్రమ చర్యలకు తెరతీయడం, తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే క్యారెక్టర్ కలిగి ఉండడమా అంటూ ప్రశ్నించారు. మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయా వర్గాలను మోసగించి, కులమతాలను చీల్చి నీచ రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబుకు క్యారెక్టర్ గురించి చెప్పుకునే అర్హత లేదన్నారు. క్యారెక్టర్ అంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఫ్యాన్ గుర్తుపై గెలిపించిన చరిత్ర జగన్‌దేనన్నారు. నీకు క్యారెక్టర్ ఉంటే వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సైకిల్ గుర్తుపై పోటీ చేయించి సత్తా చాటాలని, అప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడాలని ఎమ్మెల్యే పీఆర్కే సూచించారు. -
బాబూ రాజీనామా చేసి.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకో..
ఎమ్మెల్యేలు పిఆర్కే, గోపిరెడ్డి రెంటచింతల : రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సామాన్య ప్రజలు బతికే పరిస్థితిలు కన్పించటంలేదని మాచర్ల, నర్సరావుపేట ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం రెంటచింతలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రాని దోచుకుందాం.. అనే ధోరణిలో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు పీకలదాకా కూరుకుపోయారని ఆ కేసు నుంచి బయటపడేందుకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ , సెక్షన్ 8 గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబు వెంటనే రాజీనామా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సిద్ధం కావాలని సవాలు చేశారు. ఓటుకు నోటు విషయంలో పట్టపగలే పట్టుబడ్డ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో వచ్చిన కమీషన్లతో తెలంగాణాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీమాంధ్ర ప్రజల పరువుతీశారని దుయ్యబట్టారు. రైతులు, మహిళల ఓట్లతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు వారిని నిలువన మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితిలలో రాష్ర్టంలో ఎమర్జన్సీ పాలన అమలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డి, వైసీపీ నాయకులు గోగుల సీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ర్టంలో టీడీపీ రాక్షసపాలన
రాప్తాడు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే పీఆర్కే మాచర్లటౌన్: రాష్ట్రంలో టీడీపీ రాక్షస పాలన కొనసాగిస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను దారుణంగా చంపుతున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బీ ప్రసాద్‌రెడ్డిని దారుణంగా తహశీల్దార్ కార్యాలయంలో వేటకొడవళ్లతో నరికి చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో అధికారులను సైతం తొత్తులుగా చేసుకొని తహశీల్దార్ కార్యాలయం లోపలే హత్య చేయడాన్ని బట్టి అధికారపార్టీ నాయకుల బరితెగింపు అర్థమవుతుందన్నారు. పూర్తి స్థాయిలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. అధికారపార్టీ రాజకీయ హత్యాకాండను ప్రజలకు వివరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు.