ఇదేనా సాధించిన ఘనత ?
ఇదేనా సాధించిన ఘనత ?
Published Fri, Aug 19 2016 7:08 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
ఎమ్మెల్యే పీఆర్కే
మాచర్ల : వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు శుభం జరుగుతుందని కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ప్రచారం చేసుకుని మీరు సాధించింది కేవలం రూ.1,976 కోట్లేనా అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇదిగో ప్రత్యేక హోదా వచ్చేస్తోంది.. బీజేపీ మా మిత్రపక్షం... రాష్ట్రానికి న్యాయం జరుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. రెండు వారాల నుంచి పార్లమెంట్‌లో ౖవైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే వారంరోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పిన కేంద్రమంత్రి అరుణŠ జైట్లీ హోదా గురించి మాట్లాడకుండా అరకొర నిధులు ఇచ్చినా టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్టు నటిస్తూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. ఐదు కోట్ల మంది ఆకాంక్షలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కేవలం నామమాత్రంగా నిధులు విదిలించి చేతులు దులుపుకొందన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Advertisement
Advertisement