spl status
-
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి
విజయవాడ (రైల్వేస్టేషన్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో ఢిల్లీ’కి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో బీసీ సంక్షేమ సంఘం ఏపీ యూత్ ప్రెసిడెంట్ కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను తక్షణమే ప్రకటించాలన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 15వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. -
ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీశారు
విజయవాడ(మధురానగర్) : ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అని, అటువంటి హక్కును అధికార టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు భగ్నం చేసి తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు, ఏపీఎస్‌వైఎఫ్ నాయకులు నవనీతం సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీలు ఇవ్వాలని, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సమాఖ్య(ఏపీఎస్‌వైఎఫ్) ఆధ్వర్యాన గురువారం చుట్టగుంటలోని బీఎస్ఎన్ఎల్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు, నవనీతం మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలు గగ్గోలు పెట్టినా సాయం, ప్యాకేజీలతో సర్దుకుపోదాం.. అంటూ చంద్రబాబు నాయుడు ఐదు కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నీరుగార్చారని మండిపడ్డారు. రాజదాని నిర్మాణం కోసం మట్టి, నీళ్లు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ప్యాకేజీ పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10వ తేదీన విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఏపీఎస్‌వైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజు, నాయకులు పూజారి దుర్గారావు, తమ్మిన గణేష్, లంకా శశిరేఖ, గణేష్, కె.ఫణి పాల్గొన్నారు. -
ఇదేనా సాధించిన ఘనత ?
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల : వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు శుభం జరుగుతుందని కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ప్రచారం చేసుకుని మీరు సాధించింది కేవలం రూ.1,976 కోట్లేనా అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇదిగో ప్రత్యేక హోదా వచ్చేస్తోంది.. బీజేపీ మా మిత్రపక్షం... రాష్ట్రానికి న్యాయం జరుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. రెండు వారాల నుంచి పార్లమెంట్లో ౖవైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే వారంరోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పిన కేంద్రమంత్రి అరుణŠ జైట్లీ హోదా గురించి మాట్లాడకుండా అరకొర నిధులు ఇచ్చినా టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్టు నటిస్తూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. ఐదు కోట్ల మంది ఆకాంక్షలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కేవలం నామమాత్రంగా నిధులు విదిలించి చేతులు దులుపుకొందన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
హోదాపై బాబు సమాధానం చెప్పాలి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి దాచేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా అనే విషయం చర్చనీయాంశమైందని, హోదా వస్తుందా..రాదా అనే విషయంపై ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దాచేపల్లి మండలం పొందుగల గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, ఈ అంశంపై ప్రజలకు బాబు స్పష్టమైన నిజాలు చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ, టీడీపీల మ్యాన్ఫెస్టోలో కూడా పొందుపర్చారని, బీజేపీ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారో ప్రజలు వివరించాలన్నారు. ఉత్తర భారతదేశంలోని 10 రాష్ట్రాలకు హోదా ఉండటం వలనే అభివృద్ధి చెందాయని, హోదా లేకపోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందటం సాధ్యపడదన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో హోదా వస్తుందనే భావనతో రూ4.65 లక్షల కోట్లతో పరిశ్రమలు స్థాపించేందుకు అంగీకారం తెలిపారని, హోదా రాకపోవటం వలన ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో నెలకొల్పలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతి నుంచి కేంద్రమంత్రులు, గవర్నర్‌ను కలిసి హోదా అవశ్యకతను వివరించారని, హోదా కోసం సభలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్షపార్టీగా హోదా కోసం శక్తికి మించి పోరాడుతున్నామని, హోదా వచ్చేంత వరకు పోరాటంను ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారపార్టీ అరచకాలు ఎక్కువైయ్యాయని, వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. -
హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
నరసరావుపేట శాసన సభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి: ప్రత్యేక హోదా పై సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని నర్సరావుపేట శాసన సభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్తెనపల్లిలో ఓ ప్రవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి ప్రత్యేకహోదా పై హామీ ఇచ్చినప్పటికీ దాని కోసం పోరాడక పోగా ప్రత్యేక ప్యాకేజి, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సున్నితమైన అంశమన్నారు. విడగొట్టిన చిన్న రాష్ట్రాలకు సహాయం చేయ కుండా ప్రత్యేక హోదా రాదని, అందరిని చల్లార్చే విధంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నచ్చ చెబుతుందన్నారు. వారితో పాటు గజ్జల వైద్యశాల వైద్యులు డాక్టర్ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
‘హోదా’ కోరుతూ మానవహారం
గుంటూరు వెస్ట్ : ఏపీకి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలుచేయాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ తక్షణమే ప్రకటించాలని కోరుతూ నగరంలోని జిన్నాటవర్ సెంటర్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బుధవారం మానవహారం చేపట్టారు. సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ప్రత్యేక హోదా సాధన సమితి, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మానవహారాన్ని ఉద్దేశించి ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారం చేపట్టాక హామీని విస్మరించడం దారుణమన్నారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, పార్టీ నాయకులు తాడికొండ నరసింహారావు, ఏ.హరి, కొల్లి రంగారెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వీ.సుబ్బారావు, జిల్లా కార్యదర్శి రామయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లగండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ మాట నిలబెట్టుకోవాలి
దాచేపల్లి: ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధుల కేటాయింపుపై బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్సీ ఎఎస్. రామకృష్ణ అన్నారు. మంగళవారం దాచేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఏపీకి హోదాతో పాటుగా నిధులు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత లోటు బడ్జెట్లో ఉన్న ఏపీని సరైన విధానంలో ఆదుకోవటంలేదని ఆయన అన్నారు. అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని, లేదంటే తరువాత జరిగే పరిణామాలకు ఆపార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 21వేల కోట్లను ఖర్చుపెడుతోందని ఆయన వెల్లడించారు. పీఈటీ, పండిట్ ఉపాధ్యాయులను అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం అమోదం తెలిపారని, సాంఘీక సంక్షేమ వసతి గృహాలను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు ప్రభుత్వం పెంచిదని ఆయన చెప్పారు. -
‘హోదా’ ఇచ్చే వరకూ పోరాటం
జిల్లా సర్పంచుల సంఘం తీర్మానం గుంటూరు వెస్ట్ : విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు కేంద్రంపై ఉద్యమిస్తామని పలువురు సర్పంచులు స్పష్టం చేశారు. జిల్లా సర్పంచుల సంఘ సమావేశం సీతారామ్ నగర్ 2వ లైన్‌లోని కార్యాలయంలో శనివారం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి శ్రీనివాసరావు సమావేశానికి అధ్యక్షత వహించారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా పెదకాకాని సర్పంచ్ ఆళ్ల వీరరాఘవమ్మ కేక్‌ను కట్ చేశారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయించడం(బదిలీ చేయడం)పై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈఓపీఆర్డీలు ఇష్టానుసారం వ్యవహరించకుండా ప్రతి విషయాన్ని సర్పంచ్‌కు తెలియజేయాలని తీర్మానించారు. -
‘హోదా’ కోసం యువజన కాంగ్రెస్ ర్యాలీ
విజయవాడ సెంట్రల్ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుంటే యువత భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో కొవ్వొత్తుల, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. విభజన సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఐదేళ్ళు చాలదు. పదేళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ ఇప్పుడు మాట మార్చడం తగదన్నారు. నాయకులు మీసాల రాజేశ్వరరావు, ఐతా కిషోర్, దండమూడి రాజేష్, కొరివి చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది
గుంటూరు (నగరంపాలెం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన తర్వాత కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు వైదొలిగినా తప్పు లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకు పోతే విభజనలో బాగస్వామి అయిన బీజేపీ నవ్యాంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది
గుంటూరు (నగరంపాలెం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన తర్వాత కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు వైదొలిగినా తప్పు లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకు పోతే విభజనలో బాగస్వామి అయిన బీజేపీ నవ్యాంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
బంద్ విజయవంతం
ఉదయం 5 గంటల నుంచి నాయకులు, ప్రజల బైఠాయింపు వెలవెలబోయిన ప్రభుత్వ కార్యాలయాలు బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్ర అడుగడుగునా అడ్డలంకులే.. ప్రత్యేక హోదా కోసం పరితపిస్తున్న ప్రతి వ్యక్తి బంద్‌లో భాగస్వాములయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు అడుతున్నారంటూ నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో జరిగిన బంద్ సక్సెస్ అయింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలిపాయి. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. సాక్షి, అమరావతి : జిల్లాలో బంద్ సక్సెస్ అయింది. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రతిబింబించేలా ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. టీడీపీ, బీజేపీల తీరును ఎండగడుతూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బంద్‌కు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌తో పాటు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. దుకాణాలు, విద్యాసంస్థలు, పెట్రోలు బంకులను స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం ఐదు గంటలకే ఆర్టీసీ బస్ డిపోల వద్దకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకొని బైఠాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న బంద్‌ను విఫలం చేసేందుకు చేసిన ప్రభుత్వ కుట్రను ప్రజలు తిప్పికొట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతలను అడ్డుకొని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా నినాదాన్ని గట్టిగా వినిపించారు. మంగళవారం జరిగిన బంద్‌లో ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్ష జనంలో ప్రతిబింబించింది. యువకులు, విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లా అర్బన్ పరిధిలో 242 మంది, రూరల్ పరిధిలో 589 మంది కలిపి మొత్తం 831 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు నగరంలో ఉదయం ఐదు గంటలకే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్lముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు మేరుగ నాగార్జున, వాణిజ్య విభాగం నాయకుడు ఆతుకూరి ఆంజనేయులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో వారిని ఏడు గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి విభాగం నాయకుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శంకర్‌విలాస్ సమీపంలోని ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేస్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఎసై ్స అమీర్ వీరిపై దురుసుగా ప్రవర్తించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయింపులో సీపీఎం జిల్లా అధ్యక్షుడు పాశం రామారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పాల్గొన్నారు. మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనప్రదర్శన చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాలరావు, షేక్ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో బంద్‌కు అపూర్వ స్పందన లభించింది. ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతత్వంలో పట్టణంలో బైక్ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. పోలీసులు ఆయనతోపాటు 14 మంది పార్టీ నేతలను అరెస్టు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. పెదకూరపాడులో నియోజకవర్గ ఇన్చార్జి కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ప్రజలు బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఆధ్వర్యంలో బంద్ సాగింది. తెల్లవారుజామున మూడు గంటలకే బస్టాండ్‌కు చేరుకుని బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. రింగ్‌రోడ్డు సెంటర్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, ప్రజలు మాచర్ల – గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నేతత్వంలో బంద్ చేపట్టారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పట్ణణ అధ్యక్షుడు రాధాకష్ణమూర్తి సహా ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల ఆర్కే ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. తెల్లవారుజామున ఐదు గంటలకే పార్టీ శ్రేణులు బస్టాండ్‌కు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. తాడేపల్లి, దుగ్గిరాలలో బంద్ విజయవంతమైంది. ఎమ్మెల్యేతో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా నిలువరించారు. ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని రెండు గంటల పాటు స్టేషన్లో నిర్బంధించారు. గురజాల నియోజకవర్గంలో జంగా ఆధ్వర్యంలో బంద్ సాగింది. జంగాతో పాటు పలువురు ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పిడుగురాళ్లలో బంద్ ప్రశాంతంగా సాగింది. బాపట్ల నియోజకవర్గంలో పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బస్సు డిపో వద్ద బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. వీరితోపాటు మరో పది మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హోదా లేకపోతే పదువులు ఎందుకు?
ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగేశ్వరరావు గుంటూరు వెస్ట్ : ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ హోదాను ఇవ్వాలని, లేకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. అరండల్‌పేటలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక తరగతి హోదా విషయంలో మోదీని మెప్పించలేని వెంకయ్యనాయుడు కుప్పిగంతులు వేస్తున్నారని విమర్శించారు. మంగళవారం చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమితి జిల్లా అధ్యక్షుడు పీ.వీ.మల్లికార్జునరావు, నాయకులు తాడికొండ నరసింహారావు, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ప్రజానాట్య మండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘హోదా’పై బంద్ విజయవంతం
-
ప్రత్యేక హోదా కోసం ఎస్టీయూ నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుపర్చేందుయు నిరాకరించిన బీజేపీ ప్రభుత్వం, హోదా కోసం పోరాటం చేయని టీడీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులోని శంకర్‌విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకూ ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుధీర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ, విభజన హామీలు, ఉద్యోగ అవకాశాల కల్పనకు, రాష్ట్ర ప్రగతికై పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 2న ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్ధతు ప్రకటిస్తున్నట్లు సుధీర్ బాబు ప్రకటించారు. అనంతరం బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎస్. రామచంద్రయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కళ్లకు గంతలతో నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గుంటూరు నగరంలోని మార్కెట్ సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అయ్యస్వామి మాట్లాడుతూ హోదా కోసం సీఎం చంద్రబాబు నాయుడు పోరాటం చేయాలని, హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. హోదా కోసం టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని, 14వ ఆర్థికS సంఘ సిఫార్సుల ప్రకారం కుదరదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. వైఎస్సార్సీపీ బంద్‌కు మద్దతు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన మేరకు ఆగస్టు 2న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అయ్యస్వామి తెలిపారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్, నాయకులు ఎస్డీ గౌస్ బాషా, రాజేష్, కొవ్వూరి హరి ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘హోదా’తోనే రాష్ట్రానికి మేలు
ఆగస్ట్ 2న జరిగే బంద్‌ను విజయవంతం చేయాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి సత్తెనపల్లి: ప్రత్యేక హోదా సాధనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వైఎస్సార్‌ససీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్ట్ 2న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం పట్టణంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ చల్లంచర్ల సాంబశివరావు గహంలో వ్యాపార వర్గాలతో నిర్వహించిన సమావేశంలో రాంబాబు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్నారు. ఆదాయ పన్ను, అమ్మకం పన్నులు మినహయింపులు ఉంటాయన్నారు. తమిళనాడు, కర్ణాటకలలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారన్నారు. ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, లాభాలు మెండుగా ఉంటాయన్నారు. లాభం వస్తుందనుకుంటే ఏ పారిశ్రామిక వేత్త అయినా పరిశ్రమలు నెలకొల్పుతారన్నారు. తద్వారా ఉద్యోగావకాశాలు పెరిగి, నిరుద్యోగ సమస్య తగ్గుతుందని, రాష్ట్రాభివద్థి జరుగుతుందన్నారు.అధికారంలోకి రాకముందు ప్రత్యేకహోదా కావాలన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా సంజీవని కాదని మాట్లాడుతున్నారన్నారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యేకహోదా సాధ్యం కాదంటుందన్నారు. ప్రజలంతా సహకరించాలి.. కేంద్ర ప్రభుత్వం పై ప్రజా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తమ పై ఉందన్నారు. ప్రజలందరూ సహకరిస్తే తెలుగురాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. వ్యాపారులు అందరూ ఆగస్ట్ 2న జరిగే రాష్ట్ర బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌మహబూబ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ నాగుర్‌మీరాన్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ చల్లంచర్ల సాంబశివరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కట్టా సాంబయ్య, మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, పట్టణ, మండల యూత్ సెల్ అధ్యక్షుడు అచ్యుత్ శివ ప్రసాద్, కళ్ళం విజయభాస్కరరెడ్డి, బీసీ సెల్ జిల్లా నాయకులు దుగ్గి భద్రయ్య, వరికల్లు రామయ్య, ఎస్సీ సెల్ నాయకులు కోడిరెక్క దేవదాసు, మద్దు రత్నరాజు, పార్టీ నాయకులు ఆకుల హనుమంతురావు, గూడా శ్రీనివాసరెడ్డి, కొత్తా భాస్కర్, వ్యాపారులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు ఆనందపేట: టీడీపీ, బీజేపీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌ను పచ్చిగా మోసం చేయటాన్ని నిరసిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా, నగర కాంగ్రెస్ అధ్వర్యంలో శనివారం హిందూ కళాశాల సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు . ఈసందర్భంగా మల్లికార్జున రావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలకు ఎంతో ముఖ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు ముత్యాలరావు మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో తిరుపతి సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడి హమీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా 11 రాష్ట్రాలకు చెందిన పార్టీలు మద్దతు తెలిపినా దీనిపై ప్రకటన చేయకపోవటం దారుణం అన్నారు. ఆంధ్రులు అమాయకులు కాదని.., బీజేపీ, టీడీపీలకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు బలిదానానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలి, నాయకులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఈరి రాజశేఖర్, ఎర్రబాబు, మొగిలి శివకుమార్, సవరం రోహిత్, దొంతా సురేష్, మదనమోహన్‌రెడ్డి, చిలుకా రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ప్రత్యేక హోదా కోసం 2వ రోజు రిలే దీక్షలు
-
ఏపీలో ప్రత్యేక హోదా కోసం 2వ రోజు రిలే దీక్షలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేపట్టిన ఈ దీక్షలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ దీక్షలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు భారీగా ప్రజలు పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా : ఉండి : ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ నేత పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాలకొల్లు : స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తణుకు : తణుకులో వైఎస్ఆర్ సీపీ నేత కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గోపాలపురం : తానేటి వనిత ఆధ్వర్యంలో రిలే దీక్షలు. అనంతపురం జిల్లా : తాడిపత్రి : వైఎస్ఆర్ సీపీ నేత వీఆర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో. అలాగే పార్టీ నేత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. మండపేట : మండపేటలో వేగుళ్ల పట్టాభిరామయ్య, లీలాకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ. అనంతరం రిలే దీక్ష. పి.గన్నవరం : కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అనంతరం రిలే దీక్ష. అనపర్తి : డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భిక్షాటన. రాజమండ్రి రూరల్ : ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. కడియం : గిరిజాల వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు. అమలాపురం : మాజీ మంత్రి పి.విశ్వరూప్, చిట్టబ్బాయి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రామచంద్రాపురం : ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ముమ్మడివరం: గుత్తుల సాయి ఆధ్వర్యంలో రెండోరోజు రిలే దీక్షలు. రాజోలు : బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రంపచోడవరం : ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రాజానగరం : జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. జగ్గంపేట : ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కృష్ణాజిల్లా : పెడన : బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నందిగామ: జగన్మోహన్రావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తిరువూరు: ఎమ్మెల్యే రక్షానిధి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గుంటూరు జిల్లా : బాపట్ల : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోనా రఘుపతి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. మాచర్ల : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గుంటూరు : నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. మంగళగిరి : ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రేపల్లె : మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నెల్లూరు జిల్లా : ఆమంచర్ల : ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరవాలంటూ అమంచర్లలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గంటానాథం. చిత్తూరు జిల్లా : సత్యవేడు : సత్యవేడులో పార్టీ నేతలు ఆదిమూలం మునిశేఖర్‌రెడ్డి, సుశీల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్ష. కుప్పం : కుప్పంలో వైఎస్ఆర్ సీపీ నేతల రిలే దీక్షలు పలమనేరు : ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జీడీ నెల్లూరు: స్థానిక ఎమ్మెల్యే నారాయణస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు పూతలపట్టు: ఎమ్మెల్యే సునీల్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. బి.కోట : వైఎస్ఆర్ సీపీ నేతల రిలే దీక్షలు వైఎస్ఆర్ జిల్లా : జమ్మలమడుగు : హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కర్నూలు జిల్లా : బనగానపల్లె : వైఎస్ఆర్ సీపీ నేత కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు. నంద్యాల : భూమా నాగిరెడ్డి ఆధ్వర్యలో రిలే దీక్షలు. అళ్లగడ్డ: అఖిలప్రియ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కర్నూలు: స్థానిక ధర్నా చౌక్ వద్ద ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కల్లూరు : గౌరు సరిత ఆధ్వర్యంలో రిలే దీక్షలు. -
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ రిలే దీక్షలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు... కార్యకర్తలు శనివారం చేపట్టిన రిలే దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రారంభమైనాయి. ఈ నెల 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలు చేపట్టనున్నారు. అలాగే ఈ నెల19న ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నాయి. అందులోభాగంగా ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేయనున్నాయి. ఈ నెల 20వ తేదీ సాయంకాలం నియోజకర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షల వివరాలు... అనంతపురం జిల్లా: రాయదుర్గం : మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తాడిపత్రి : స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షలకు మద్దతు తెలిపిన సీపీఐ నేతలు నర్సింహయ్య, రంగయ్య. అలాగే రాజధాని శంకుస్థాపనకు వెళ్లకూడదన్న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సీపీఐ నేతలు ఈ సందర్బంగా స్వాగతించారు. వైఎస్ జగన్ నిర్ణయం అభినందనీయమన్నారు. కల్యాణదుర్గం: వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. మడకశిర : పార్టీ సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కర్నూలు జిల్లా : కర్నూలు : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జి.జయరామ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. బనగానపల్లె : స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నంద్యాల : పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కడప జిల్లా: కడప : ప్రత్యేక హోదా కోరుతూ పులివెందుల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రైల్వే కోడూరు : స్థానిక గాంధీ విగ్రహాం వద్ద వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి బండారు సుభద్రమ్మ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రొద్దుటూరు : స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు బద్వేల్ : పట్టణంలో వైఎస్ఆర్ సీపీ నేత బీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జమ్మలమడుగు : వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చిత్తూరు జిల్లా : తిరుపతి: స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు... పాల్గొన్న స్థానిక ఎంపీ వర ప్రసాద్, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మమత. జీడీ నెల్లూరు : ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పీలేరు : స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పలమనేరు : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అమర్నాధ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. సత్యవేడు : స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత ఆదిమూలం, మునిశేఖర్‌రెడ్డి, రాధారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నెల్లూరు జిల్లా : ఇందుకూరుపేట : ఇందుకూరుపేటలో వైఎస్ఆర్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ప్రకాశం జిల్లా : పరుచూరు : నియోజకవర్గం ఇంఛార్జ్ గొట్టిపాటి భరత్‌కుమార్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గిద్దలూరు : ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం. అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గుంటూరు జిల్లా : రేపల్లె : వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధర్వంలో రిలే దీక్షలు, పాల్గొన్న కౌన్సిలర్లు, కార్యకర్తలు. అమరావతి : స్థానిక పార్టీ సమన్వయకర్త పాణెం అనిమిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. చిలకలూరిపేట: గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.. పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు. గుంటూరు : నగరంలోని కొత్త బస్టాండ్ ఎదుట వైఎస్ఆర్ సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. వినుకొండ : స్థానిక పార్టీ ఇంచార్జీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు. మాచర్ల : స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. కృష్ణాజిల్లా : పెడన : పెడన బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేత రాంప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు. మైలవరం : నియోజకర్గం ఇంఛార్జ్ జోగి రమేష్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా : కొయ్యలగూడెం : వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నరసాపురం : వైఎస్ఆర్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. తూర్పుగోదావరి జిల్లా : జగ్గంపేట : స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, నవీన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. కడియపులంక: స్థానిక జాతీయ రహదారిపై దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సీపీ నేత ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ముమ్మడివరం : స్థానిక నాయకుడు గుత్తుల సాయి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రాజమండ్రి : స్థానిక కోటగుమ్మం సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వరంలో రిలే దీక్షలు. రంపచోడవరం : వైఎస్ఆర్ సీపీ నేత, పార్టీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నాయకులు ఉదయ్ భాస్కర్, బాలకృష్ణ పాల్గొన్నారు. మండపేట : స్థానిక నాయకుడు పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రామచంద్రాపురం : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పి. గన్నవరం : పార్టీ నేత కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రాజోలు : బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పిఠాపురం : పార్టీ సమన్వయ కర్త పెండెం దొరబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. విశాఖపట్నం జిల్లా : విశాఖ కలెక్టరేట్ : వైఎస్ఆర్ సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, కోలా గురువులు, జాన్ వెస్లీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. ఇసుకతోట : పార్టీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొయ్య ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. గురుద్వార్ : వైఎస్ఆర్ సీపీ నేతలు ఉషాకిరణ్, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఎన్ఏడీ కొత్త రోడ్డు : మాజీ ఎమ్మెల్యే మళ్లా విజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు పెందుర్తి : పార్టీ నేత ఆదీప్ రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు అనకాపల్లి : ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత ఆధ్వర్యలో రిలే దీక్షలు పాడేరు : రిలే దీక్షను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ తగరపువలస: బీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ కర్రి సీతారం ఆధ్వర్యంలో రిలే దీక్షలు. నర్సిపట్నం : నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమాశంకర్‌గణేశ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాయకరావుపేట : నియోజకవర్గ ఇంఛార్జ్ చెంగల వెంకట్రావ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఎలమంచిలి : నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు విజయనగరం జిల్లా : సాలూరు : స్థానిక ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో రిలే దీక్షలు శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం : పట్టణంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. టెక్కలి : నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాతపట్నం : స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రణస్థలం : పార్టీ సమన్వయకర్త గొల్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. అముదాలవలస : పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో రిలే దీక్షలు. పాలకొండ : స్థానిక ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో రిలే దీక్షలు. రాజాం : స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రిలే దీక్షలు. -
అందుకే బాబు మాట్లాడటం లేదు
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుపై లక్ష్మీపార్వతి గురువారం తిరుపతిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు భగ్నం చేశారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలుగు ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదని లక్ష్మీ పార్వతి తెలిపారు. -
సుజనాలాంటి నేతల జేబు నిండుతుంది
హైదరాబాద్ : ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు స్పష్టం చేశారు. అదే ప్రత్యేక ప్యాకేజీ వస్తే కేంద్రమంత్రి సుజనాచౌదరిలాంటి నేతల జేబు నిండుతుందన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా ఏర్పాటు చేసిన రిలే దీక్షలో శేషుబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మధ్య గల తేడాను ఆయన వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద బుధవారం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రిలే నిరాహారదీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
హోదా కోసం టవరెక్కిన యువకుడు
కడప : ప్రత్యేక హోదా కోరుతూ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా తొండూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. తుండూరు గ్రామానికి చెందిన నంద్యాల రామనాథ్‌రెడ్డి (30) సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకుని అతడిని బుజ్జగించి...కిందకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ... ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బంద్‌లో పాల్గొన్న రామనాథ్ రెడ్డి అనంతరం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు ప్రకటించాడని స్థానికులు వెల్లడించారు. -
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ... విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం స్థానిక ఎస్.ఆర్.ఆర్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. అనంతరం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ విద్యార్థుల నినాదాలతో నగర రహదారులు మార్మోగాయి. అనంతరం రహదారిపై మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రాణ త్యాగం చేసిన మునికోటి ఆశయాలను సాధించుకోవడం కోసం విద్యార్థులంతా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు అవిశ్రాంతంగా పోరాడాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు పిలుపు నిచ్చారు. -
అవినీతి, అక్రమాల్లోనే బాబు ‘ప్రత్యేక’త!
సాక్షి, హైదరాబాద్: అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధించడంలో తప్ప చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాల్లో మాత్రం అనేక ప్రత్యేకతలు సాధించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా దుయ్యబట్టారు. ఆదివారమిక్కడఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారం చేపట్టగానే రాష్ట్రానికి కరువు కాటకాలను తెచ్చి ప్రత్యేకత సాధించారని, రైతులు, డ్వాక్రా మహిళల రుణాల్ని మాఫీ చేయకుండా మోసగించడంలో ప్రత్యేకహోదా సాధించారని ధ్వజమెత్తారు. జాతీయహోదా లభించిన పోలవరం ప్రాజెక్టు పనుల్ని తుంగలో తొక్కి పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టి రూ.700 కోట్ల అవినీతి సొమ్మును కాజేయడంలో నంబర్‌వన్‌గా నిలవడం, ఇసుక దోపిడీలో టీడీపీ మంత్రులు, చీఫ్‌విప్‌లు నంబర్‌వన్ స్థానంలో ఉండటం, ఆడపిల్లల అభద్రతలో నంబర్‌వన్, మద్యం అమ్మకాలు, బెల్ట్‌షాపుల్లో నంబర్‌వన్ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారని ఆమె దుయ్యబట్టారు. గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొనడం ద్వారా చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి ప్రత్యేకతను సంతరింపజేసుకున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీఎంకే కోటి మృతికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలని ఆమె అన్నారు. పోయి చేతులు కట్టుకున్నారు: బుగ్గన రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి వారి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక తప్పులు చేసి వాటిలో కూరుకుపోయిన చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా అడిగే పరిస్థితిలో లేరన్నారు.హోదాకు 14వ ఆర్థిక సంఘం అడ్డు చెబుతోందని గాలి ముద్దు కృష్ణమనాయుడు చెప్పడం తగదన్నారు. -
'వెంకయ్యనాయుడు పూర్తిగా అధికారానికి బానిస'
కాకినాడ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిపై మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆదివారం కాకినాడలో నిప్పులు చెరిగారు. వెంకయ్యనాయుడు పూర్తిగా అధికారినికి బానిస అయ్యారని ఆరోపించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దిశలో నడుస్తున్నారని విమర్శించారు. విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదాపై మాట మార్చి వెంకయ్యనాయుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో రేపు దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కారెం శివాజీ ప్రకటించారు. -
బాబు హయాంలో అన్ని 'స్పెషల్ స్టేటస్‌లే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియాలో స్పెషల్ స్టేటస్.... లిక్కర్ మాఫియాలో స్పెషల్ స్టేటస్.... మహిళపై దాడుల్లో స్పెషల్ స్టేటస్.... ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో స్పెషల్ స్టేటస్ తీసువచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. అంతేకాని కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికన చంద్రబాబు... కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు భయపడుతున్నారని విమర్శించారు. అందుకే కేంద్రం ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ... తెస్తామని చంద్రబాబు... తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు. కానీ మోదీకి పీఎం... బాబుకి సీఎం హోదాలు వచ్చాయి కానీ....ఏపీ మాత్రం ప్రత్యేక హోదా రాలేదన్నారు. బీజేపీ, టీడీపీలకు ఓటు వేయండి అంటూ ఎన్నికల సమయంలో చెప్పిన పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పుడు మౌనంగా ఉన్నారని రోజా తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లోని నేతలంతా ప్రత్యేక హోదా తీసుకు రావడంలో విఫలమైన నేపథ్యంలో తప్పించుకోవాడాని కుంటి సాకుల చెబుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం చట్టంలో సవరణలు చేసి ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఎందుకు మనస్సు రావడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. చట్టంలో సవరణలు చేసైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రోజా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్
హైదరాబాద్: స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్ నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం న్యూఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద రేపు నిర్వహించనున్న ధర్నాకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరుకానున్నారు. వైఎస్ జగన్ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నా అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వారంతా ఏపీ ప్రత్యేక హోదా కోసం మార్చ్ టు పార్లమెంట్ చేయనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో న్యూఢిల్లీ బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు మాటలే చెప్పాం.... ఇకపై చేతల్లో చూపిస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం కోసం అధికార టీడీపీ... ఏపీకి ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కిందని వారు ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ ధర్నా ద్వారా పత్ర్యేక హోదా కోసం కేంద్రంపై పోరుబాటకు వైఎస్ఆర్ సీపీ శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత కేంద్ర, రాష్ట్రాలపైనే ఉందని వైఎస్ఆర్ సీపీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. రేపు వైఎస్ జగన్ ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ సీపీ తన మద్దతు ప్రకటించింది.