'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' | SRR College students rally in vijayawada due to spl status | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'

Published Mon, Aug 10 2015 11:48 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

SRR College students rally in vijayawada due to spl status

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ... విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం స్థానిక ఎస్.ఆర్.ఆర్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. అనంతరం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ విద్యార్థుల నినాదాలతో నగర రహదారులు మార్మోగాయి.

అనంతరం రహదారిపై మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రాణ త్యాగం చేసిన మునికోటి ఆశయాలను సాధించుకోవడం కోసం విద్యార్థులంతా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు అవిశ్రాంతంగా పోరాడాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు పిలుపు నిచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement