ఏపీలో ప్రత్యేక హోదా కోసం 2వ రోజు రిలే దీక్షలు | YSRCP conducts second day relay deeksha in ap state | Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రత్యేక హోదా కోసం 2వ రోజు రిలే దీక్షలు

Published Sun, Oct 18 2015 11:09 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

YSRCP conducts second day relay deeksha in ap state

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేపట్టిన ఈ దీక్షలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ దీక్షలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు భారీగా ప్రజలు పాల్గొంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా :
ఉండి : ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ నేత పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
పాలకొల్లు : స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
తణుకు : తణుకులో వైఎస్ఆర్ సీపీ నేత కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
గోపాలపురం : తానేటి వనిత ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

అనంతపురం జిల్లా :
తాడిపత్రి : వైఎస్ఆర్ సీపీ నేత వీఆర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో. అలాగే పార్టీ నేత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

తూర్పుగోదావరి జిల్లా :
రాజమండ్రి : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
మండపేట : మండపేటలో వేగుళ్ల పట్టాభిరామయ్య, లీలాకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ. అనంతరం రిలే దీక్ష.
పి.గన్నవరం : కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అనంతరం రిలే దీక్ష.
అనపర్తి : డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భిక్షాటన.
రాజమండ్రి రూరల్ : ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.
కడియం : గిరిజాల వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు.
అమలాపురం : మాజీ మంత్రి పి.విశ్వరూప్, చిట్టబ్బాయి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రామచంద్రాపురం : ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
ముమ్మడివరం:  గుత్తుల సాయి ఆధ్వర్యంలో రెండోరోజు రిలే దీక్షలు.
రాజోలు : బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రంపచోడవరం : ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రాజానగరం : జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
జగ్గంపేట : ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

కృష్ణాజిల్లా :
పెడన : బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
నందిగామ: జగన్మోహన్రావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
తిరువూరు: ఎమ్మెల్యే రక్షానిధి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

గుంటూరు జిల్లా :
బాపట్ల : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోనా రఘుపతి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
మాచర్ల : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
గుంటూరు : నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
మంగళగిరి : ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
రేపల్లె : మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

నెల్లూరు జిల్లా :
ఆమంచర్ల : ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరవాలంటూ అమంచర్లలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో గంటానాథం.

చిత్తూరు జిల్లా :
సత్యవేడు : సత్యవేడులో పార్టీ నేతలు ఆదిమూలం మునిశేఖర్రెడ్డి, సుశీల్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్ష.
కుప్పం : కుప్పంలో వైఎస్ఆర్ సీపీ నేతల రిలే దీక్షలు
పలమనేరు : ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు
జీడీ నెల్లూరు: స్థానిక ఎమ్మెల్యే నారాయణస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు
పూతలపట్టు: ఎమ్మెల్యే సునీల్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
బి.కోట : వైఎస్ఆర్ సీపీ నేతల రిలే దీక్షలు

వైఎస్ఆర్ జిల్లా :
జమ్మలమడుగు : హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు

కర్నూలు జిల్లా :
బనగానపల్లె : వైఎస్ఆర్ సీపీ నేత కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు.
నంద్యాల : భూమా నాగిరెడ్డి ఆధ్వర్యలో రిలే దీక్షలు.
అళ్లగడ్డ: అఖిలప్రియ ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
కర్నూలు: స్థానిక ధర్నా చౌక్ వద్ద ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.
కల్లూరు : గౌరు సరిత ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement