
సుజనాలాంటి నేతల జేబు నిండుతుంది
హైదరాబాద్ : ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు స్పష్టం చేశారు. అదే ప్రత్యేక ప్యాకేజీ వస్తే కేంద్రమంత్రి సుజనాచౌదరిలాంటి నేతల జేబు నిండుతుందన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా ఏర్పాటు చేసిన రిలే దీక్షలో శేషుబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మధ్య గల తేడాను ఆయన వివరించారు.
రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద బుధవారం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రిలే నిరాహారదీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే.