తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుపై లక్ష్మీపార్వతి గురువారం తిరుపతిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు భగ్నం చేశారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలుగు ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదని లక్ష్మీ పార్వతి తెలిపారు.