
‘హోదా’ కోసం యువజన కాంగ్రెస్ ర్యాలీ
: రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుంటే యువత భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు.
విజయవాడ సెంట్రల్ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుంటే యువత భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో కొవ్వొత్తుల, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. విభజన సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఐదేళ్ళు చాలదు. పదేళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ ఇప్పుడు మాట మార్చడం తగదన్నారు. నాయకులు మీసాల రాజేశ్వరరావు, ఐతా కిషోర్, దండమూడి రాజేష్, కొరివి చైతన్య తదితరులు పాల్గొన్నారు.