‘హోదా’ కోరుతూ మానవహారం
Published Wed, Aug 10 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
గుంటూరు వెస్ట్ : ఏపీకి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలుచేయాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ తక్షణమే ప్రకటించాలని కోరుతూ నగరంలోని జిన్నాటవర్ సెంటర్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బుధవారం మానవహారం చేపట్టారు. సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్, ప్రత్యేక హోదా సాధన సమితి, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మానవహారాన్ని ఉద్దేశించి ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారం చేపట్టాక హామీని విస్మరించడం దారుణమన్నారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, పార్టీ నాయకులు తాడికొండ నరసింహారావు, ఏ.హరి, కొల్లి రంగారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వీ.సుబ్బారావు, జిల్లా కార్యదర్శి రామయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లగండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement