కడప : ప్రత్యేక హోదా కోరుతూ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా తొండూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. తుండూరు గ్రామానికి చెందిన నంద్యాల రామనాథ్రెడ్డి (30) సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకుని అతడిని బుజ్జగించి...కిందకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ... ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర బంద్కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బంద్లో పాల్గొన్న రామనాథ్ రెడ్డి అనంతరం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు ప్రకటించాడని స్థానికులు వెల్లడించారు.