
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి
విజయవాడ (రైల్వేస్టేషన్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో ఢిల్లీ’కి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏపీ యూత్ ప్రెసిడెంట్ కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను తక్షణమే ప్రకటించాలన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 15వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు.