నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది
గుంటూరు (నగరంపాలెం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన తర్వాత కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు వైదొలిగినా తప్పు లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకు పోతే విభజనలో బాగస్వామి అయిన బీజేపీ నవ్యాంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.