హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
Published Thu, Aug 11 2016 8:03 PM | Last Updated on Tue, Oct 30 2018 3:56 PM
నరసరావుపేట శాసన సభ్యుడు
డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి: ప్రత్యేక హోదా పై సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని నర్సరావుపేట శాసన సభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్తెనపల్లిలో ఓ ప్రవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి ప్రత్యేకహోదా పై హామీ ఇచ్చినప్పటికీ దాని కోసం పోరాడక పోగా ప్రత్యేక ప్యాకేజి, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సున్నితమైన అంశమన్నారు. విడగొట్టిన చిన్న రాష్ట్రాలకు సహాయం చేయ కుండా ప్రత్యేక హోదా రాదని, అందరిని చల్లార్చే విధంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నచ్చ చెబుతుందన్నారు. వారితో పాటు గజ్జల వైద్యశాల వైద్యులు డాక్టర్ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement