
తాడేపల్లి: మాచర్లలో విధ్వంసానికి కారకుడు చంద్రబాబేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డాeరు. మాచర్ల టీడీపీ ఇంచార్జి విధ్వంసానికి సూత్రధారి అని అంబటి రాంబాబు విమర్శించారు. దాడులు చేయాలని చంద్రబాబు బహిరంగం సభల్లోనే రెచ్చగొట్టా మాట్లాడిన సంగతిని గుర్తు చేశారు. ప్లాన్ ప్రకారమే మాచర్లలో టీడీపీ నేతలు దాడులు చేశారని అంబటి స్పష్టం చేశారు.
‘మాచర్లలో రౌడీ రాజ్యానికి ఆజ్యం పోసిందే బ్రహ్మారెడ్డి’
మాచర్లలో రౌడీ రాజ్యానికి ఆజ్యం పోసిందే బ్రహ్మారెడ్డేనని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దారునంగా కొట్టారని, బ్రహ్మారెడ్డి గొడవలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని, వైఎస్సార్‌సీపీ ప్రశాంత వాతావరణ కోరుకుంటోందన్నారు. చంద్రబాబు రౌడీ రాజ్యాన్ని కోరుకుంటున్నారని, హింస, నేర ప్రవర్తనతో ఎన్నికల్లో గెలవలేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment