సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రైవేటీకరణపైనే ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వమే నిర్మించి, పర్మిషన్లు కూడా తెప్పించిన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రయివేటీకరణ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సేఫ్ క్లోజ్ పేరుతో మెడికల్ కాలేజీలను మూసివేయడం దారుణం. చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రయివేటీకరణ మీదే ఉంటుంది. ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదు. కానీ, వైఎస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో సీటుకు కోటిన్నర వరకు వసూలు చేస్తారు. దాని వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి. తాము అధికారంలోకి వస్తే పైసా కూడా విద్యార్థుల దగ్గర వసూలు చేయమని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు.
ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. 2,450 జనరల్ సీట్లను చంద్రబాబు వలన రాష్ట్రం కోల్పోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వమే నిర్మించి, పర్మిషన్లు కూడా తెప్పించిన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు?. ప్రైవేటీకరణ అవసరం ఏముంది?. చంద్రబాబు వలన గ్రామీణ ప్రాంతాల్లో ఇక ముందు పని చేసే డాక్టర్లే ఉండరు. ప్రజలకు విమానాశ్రయాలు ముఖ్యమా?.. మెడికల్ కాలేజీలు ముఖ్యమా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment