
తాడేపల్లి : యూనివర్శిటీలలో వైస్ చాన్సలర్లు(వీసీ)లను బెదిరించి రాజీనామాలు చేయించిన సాక్ష్యాలను వైఎస్సార్ సీపీ బయటపెట్టింది. దీనికి సంబంధించిన ఆధారాలను వైఎస్సార్ సీపీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారు. నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేష్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు.
వీసీలు రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని శాసనమండలిలో వైఎస్సార్ సీపీ ప్రశ్నించగా, లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైస్ చాన్సలర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారంటూ లోకేష్ బుకాయించారు. వీసిలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. అయితే ‘ మీరే బెదిరించి.. మీరే విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయా?’ అని ప్రశ్నిస్తే లోకేష్ కు మౌనమే సమాధానమైంది.
ఇవిగో ఆధారాలు.. న్యాయబద్ధంగా విచారణ చేయించండి
నారా లోకేష్ ఒత్తిడితో రాజీనామా చేసినట్లు ఆధారాలను బయటపెడుతున్నామని, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా వీసీల రాజీనామాపై లోకేష్ న్యాయబద్ధంగా విచారణ చేయించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ అలా కాకపోతే ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేస్ రాజీనామా చేయాలని పేర్కొంది. అప్పుడే వాస్తవాలు బయటకి వస్తాయని, న్యాయం గెలుస్తుందని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది.
💣 Truth Bomb 💣
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి @naralokesh రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో
నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ… pic.twitter.com/9MKjYOtlHL— YSR Congress Party (@YSRCParty) February 25, 2025
Comments
Please login to add a commentAdd a comment