
'వెంకయ్యనాయుడు పూర్తిగా అధికారానికి బానిస'
కాకినాడ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిపై మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆదివారం కాకినాడలో నిప్పులు చెరిగారు. వెంకయ్యనాయుడు పూర్తిగా అధికారినికి బానిస అయ్యారని ఆరోపించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దిశలో నడుస్తున్నారని విమర్శించారు.
విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదాపై మాట మార్చి వెంకయ్యనాయుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో రేపు దీక్ష చేస్తున్న వైఎస్ జగన్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కారెం శివాజీ ప్రకటించారు.