Karem Shivaji
-
‘నిమ్మగడ్డవి నీతిమాలిన పనులు’
సాక్షి, పశ్చిమగోదావరి: రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగమైన ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడం దురదుష్టకరమని ఎస్సీ, ఎస్టీ మాజీ చైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైస్సార్సీపీని టార్గెట్ చేస్తూ వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. కక్ష సాధింపు చర్యలతో బలవంతంగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న నిమ్మగడ్డది ముమ్మాటికీ బ్లాక్ మెయిల్ విధానమే అన్నారు. నిమ్మగడ్డవి నీతి మాలిన పనులంటూ దుయ్యబట్టారు. గెలుపు ఓటముల గురించి నిమ్మగడ్డకు ఎందుకని ప్రశ్నించారు. తరచూ కోర్టు మెట్లు ఎక్కడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు ఉందిని.. నిమ్మగడ్డ ప్రతిపక్ష పాత్ర మానుకుంటే మంచిదని శివాజీ సూచించారు. (కావాలనే ఘర్షణ వైఖరి) -
సీఎం జగన్ వారి గుండెల్లో నిలిచిపోతారు
సాక్షి, తిరుమల : ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకంతో సంక్రాంతిని ప్రారంభించారు. ఉగాదికి ప్రతి పేదవానికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించార’ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి పథకంతో అమ్మ.. ఇళ్ల పట్టాల పంపిణీతో అయ్య గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. సోమవారం కారెం శివాజి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి పక్షపార్టీలన్ని కూడా అసైండ్ భూము తీసుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.. ఎక్కడా కూడా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములు తీస్కోవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్ సీపీ తప్పక విజయం సాధిస్తుంది. ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలకు పట్టం కట్టారు. మూడు రాజధానులను అడ్డుకోడానికే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి సీఎం వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని ప్రజలను కోరుతున్నాము. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని, భ్రమరావతిగా ఊహించుకొంటున్నారన్న సంగతి ప్రజలు గ్రహిస్తున్నార’ని అన్నారు. -
పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలి: కారెం శివాజీ
సాక్షి, తూర్పు గోదావరి: భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డా. బీఆర్ అంబేద్కర్‌ను అవమాన పరిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తక్షణమే క్షమాణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పరిజ్ఞానం లేని పవన్ అగ్రకుల దురహంకారం వల్లే దళితుడైన అంబేద్కర్‌కు మంత్రి పదవిని మేమే ఇచ్చామని మాట్లాడుతున్నారన్నారు. ఈ క్రమంలో తక్షణమే జనసేన పార్టీ జెండా నుంచి అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేనకు గట్టి షాక్.. ‘జేడీ’ ఔట్ -
రూ. 5కోట్లు ఇస్తే రాజధాని అవసరం లేదా బాబు?
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆడపిల్లను బయటకు పంపి చదివించగలమనే భరోసా దిశ చట్టం, అమ్మఒడితోనూ కలిగిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంను సమర్థిస్తూ భీమవరంలో సోమవారం ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా శివాజీ మాట్లాడుతూ.. మాతృబాషను పరిరక్షించుకుంటూనే ఇంగ్లీష్ మీడియం కావాలని ఉద్యమాన్ని చేపట్టామన్నారు. రూ. 5 కోట్లు ఇస్తే అమరావతిలో రాజధాని అవసరం లేదా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికి న్యాయం చేస్తారని, అమరావతిలో రాజధాని నిర్మించడానికి అక్కడ ఎలాంటి వసతులు లేవన్నారు. రాజధాని అభివృద్ధి చెందాలంటే 25 సంవత్సారాలు పడుతుందని, విశాపట్నం అన్ని విధాల అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. -
రగులుతున్న రగడ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ, ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ మధ్య వివాదం రాజుకుంటోంది. బ్యాక్లాగ్ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయకపోవడం, రిజర్వేషన్ అభ్యర్థులను జనరల్ కేటగిరీలో మెరిట్ ప్రకారం తీసుకోవడం కుదరదని ఏపీపీఎస్సీ నిర్ణయించడంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ప్రమోషన్ల విషయంలో రోస్టర్ పాటించడం లేదని ఫిర్యాదులున్నాయి. వీటిపై విచారించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ గత నెలలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం ఈనెల 22వ తేదీన ఉదయభాస్కర్ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా ఆయన రాకుండా కార్యాలయ సిబ్బందిని పంపించారు. వారు సరైన సమాచారంతో రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఈనెల 31న కమిషన్ ఎదుట హాజరు కావాలని ఉదయభాస్కర్‌ను అదేశిస్తూ మరోసారి నోటీసులు జారీ చేశారు. తమ నోటీసులను లెక్క చేయకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం–1989 ప్రకారం చర్యలు చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. తాను ఎస్సీ ఎస్టీ కమిషన్ వద్దకు వెళితే తన స్థాయి తగ్గుతుందని, అందువల్ల వెళ్లే ప్రశ్నే లేదని కొందరు ఏపీపీఎస్సీ అధికారులతో ఉదయ భాస్కర్ పేర్కొన్నట్లు సమాచారం. రిజర్వేషన్ల చట్టానికి తూట్లు విద్య, ఉద్యోగాల భర్తీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మహిళలకు కూడా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. వీరంతా జనరల్ కేటగిరీలో మెరిట్ సాధిస్తే జనరల్‌లోనే ఎంపిక చేస్తారు. అయితే జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ అభ్యర్థులను ఎంపిక చేసేది లేదని, రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించినా రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ కేటగిరీలోనే ఎంపిక కావాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ నిబంధన పెట్టింది. ఇది ‘స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1996, 22–ఏ’ నిబంధనకు విరుద్ధమని రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. జనరల్ కోటాలో బ్యాక్లాగ్ పోస్టులు ఈ సంవత్సరం ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో 225 ఎస్సీ, 257 ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను జనరల్ నోటిఫికేషన్‌తో కలిపి ఖాళీలు చూపించారు. జనరల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాని ఎస్సీ, ఎస్టీ పోస్టులకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం ఆయా వర్గాలతో భర్తీ చేయాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీలో కలిపి అన్ని పోస్టులకు నోటిఫికేషన్ పిలవడం వల్ల కుల ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్లకు అర్థం లేకుండా పోయిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ వాదిస్తోంది. ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ అధికారులకు నోటీసులు ఇవ్వగానే వెంటనే సీఎం పేషీ నుంచి కాస్త స్పీడు తగ్గించుకోవాలంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీకి ఫోన్లు వస్తున్నట్లు తెలిసింది. తీరు మారకుంటే చట్టపరమైన చర్యలు.. ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్ తీరు మారకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. ఆయన విధానాల వల్ల పాలకులకు చెడ్డపేరు వస్తోంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను కాలరాయటంపై ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏపీపీఎస్సీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. – కారెం శివాజీ (రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్) -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నియామకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నియామకంపై ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీచేసింది. ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీని నియమించిన సంగతి తెలిసిందే. కమిషన్ చైర్మన్‌గా శివాజీ ఎన్నిక చెల్లదంటూ న్యాయవాది హరిప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో శివాజీ ఎంపిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పిటిషన్లో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించిన ఏపీ ప్రభుత్వం శివాజీని తిరిగి కమిషన్ చైర్మన్‌గా నియమించడంపై ఆయన కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా కమిషన్ చైర్మన్ నియామక పక్రియకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అక్టోబర్ 31న కారెం శివాజీ నేరుగా కోర్టుకు హాజరుకావాలని కూడా ఆదేశించింది. -
పోలీసుల ఓవరాక్షన్
ఒంగోలు టౌన్: ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో గురువారం సాయంత్రం ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ నిర్వహించనున్న సమీక్ష సమావేశ కార్యక్రమంలో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. కలెక్టరేట్ ఇన్ గేట్ దాటి అడుగు లోపలికి పెట్టిన వెంటనే అక్కడ పోలీసులు చైన్ ఆకారంలో నిల్చొని ఏ ఒక్కరినీ సీపీఓ కాన్ఫరెన్స్ హాలువైపునకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కమిషన్ చైర్మన్ వార్తను కవరేజ్ చేసేందుకు వచ్చిన మీడియాను కూడా మధ్యలోనే అడ్డగించారు. లోపలికి వెళ్లేది లేదంటూ అడ్డుకున్నారు. సీపీఓ కాన్ఫరెన్స్ హాలు వైపు ఉన్న పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా వారిని అడ్డుకున్నారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.శరత్‌బాబును సైతం వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వర్తించేందుకు తన మోటార్ బైక్‌పై వెళ్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. అటువైపు వెళ్లేందుకు వీల్లేదంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. తన కార్యాలయానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారంటూ ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి పోలీసులను ప్రశ్నించారు. సమావేశాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియాను మధ్యలోనే నిలువరించడంతో నిరసన తెలిపేందుకు కొంతమంది సిద్ధమయ్యారు. అదే సమయంలో కారెం శివాజీ కలెక్టరేట్‌లోకి రావడంతో పరిమిత సంఖ్యలో మీడియాను సమీక్ష సమావేశానికి అనుమతించారు. -
గరగపర్రు ఘటనలో తహసీల్దార్, ఎస్సై సస్పెన్షన్
జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన కారెం శివాజీ సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు (మెట్రో): గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణపై సకాలంలో స్పందించని పాలకోడేరు మండల తహసీల్దార్ జి.రత్నమణి, ఎస్సై వి.రాంబాబును సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచ్ ఉన్నమట్ల ఎలిజబెత్ చెక్ పవర్ రద్దు చేయాలన్నారు. మంగళవారం కారెం శివాజీ, మంత్రులు నక్కా ఆనందబాబు, కేఎస్ జవహర్ గరగపర్రులో గ్రామ సభ నిర్వహించారు. కాగా, గరగపర్రు ఘటన సున్నితమైందని, నిజనిర్దారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చెప్పారు. -
కమిషన్ చైర్మన్ పునర్నియామకానికి ప్రభుత్వం పోరాటం
– సామాజిక మాద్యమల్లో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు – ఎస్పీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వమే తనను కుట్రపన్ని దింపినట్లు సామాజిక మాద్యమాల్లో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. నియాయక ప్రక్రియలో చోటుచేసుకున్న కొన్ని సాంకేతిక కారణాలతో పదిహేను రోజుల క్రితం హైకోర్టు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసినట్లు వివరించారు. ఆదివారం కర్నూలు స్టేట్ గెస్టు హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రభుత్వం కూడా కమిషన్‌ను తిరిగి నియమించడం కోసం హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసిందన్నారు. తాను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న అతికొద్ది కాలంలోనే దళిత, గిరిజనుల అనేక సమస్యలను పరిష్కరించానని తెలిపారు. జనవరి 30 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దళిత, గిరిజనులను ఐక్యం చేసేందుకు పర్యటిస్తున్నట్లు చెప్పారు. మాలమహానాడు నాయకులు నల్లన్న, దేవన్న, జనార్దన్, లక్ష్మీనారాయణ, మునిస్వామి, బాలాజీ పాల్గొన్నారు. -
శివాజీ నియామకం చెల్లదు
కారెం శివాజీ, ప్రభుత్వ అప్పీళ్లు కొట్టివేత.. హైకోర్టు ధర్మాసనం తీర్పు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు ఉమ్మడి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ నియామకం చట్ట విరుద్ధమంటూ, అతని నియామకాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కారెం శివాజీలు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా విశిష్ట వ్యక్తినే నియమించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. -
కారెం శివాజీకి మళ్లీ చుక్కెదురు
హైదరాబాద్ : పదవి విషయంలో కారెం శివాజీకి హైకోర్టులో మళ్లీ చుక్కెదురు అయింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎంపిక నిబంధనలకు విరుద్ధం అంటూ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాగా ఎస్సీ, ఎస్టీ చైర్మన్‌గా కారెం శివాజీని నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 13న జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది జె.ప్రసాద్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సుదీర్ఘ విచారణ చేపట్టిన జస్టిస్ రామచంద్రరావు తీర్పునిస్తూ కారెం శివాజీ నియామకాన్ని రద్దు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు కారెం శివాజీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇష్టానుసారంగా నియమిస్తారా?
కారెం శివాజీ నియామకంపై రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి విశిష్టవ్యక్తి అరుు ఉండాలని చట్టం చెబుతున్నప్పుడు, అందుకు విరుద్ధంగా ఇష్టానుసారం కావాల్సిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఎవరిని చైర్మన్‌గా నియమించాలన్న విషయంలో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉన్న మాట వాస్తవమే అరుునా, నియామకం మాత్రం ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని ప్రశ్నించింది. చైర్మన్ పదవికి ప్రసాద్‌బాబు అనే వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నప్పుడు అతని దరఖాస్తును పరిగణనలోకి తీసుకోకుండా, శివాజీనే చైర్మన్‌గా నియమించాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశిష్టవ్యక్తంటే సాధారణ వ్యక్తి కాదని సింగిల్ జడ్జి తన తీర్పులో పేర్కొన్నారని, ఇందులో ఎటువంటి దోషం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే విధంగా ప్రజా సంబంధిత పోస్టుల నియామకం సహేతుకంగా, పారదర్శకంగా ఉండాలని కూడా సింగిల్‌జడ్జి చెప్పారని, ఇది కూడా సబబుగానే ఉందంది. సింగిల్ జడ్జి చెప్పిన అంశాలు ఏ విధంగా సరికాదో వివరించాలని కూడా ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను గురువారానికి వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ చైర్మన్‌గా కారెం శివాజీని నియమిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 13న జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది జె.ప్రసాద్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సుదీర్ఘ విచారణ చేపట్టిన జస్టిస్ రామచంద్రరావు గతవారం తీర్పునిస్తూ కారెం శివాజీ నియామకాన్ని రద్దు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు కారెం శివాజీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. -
‘దళితులకు పవన్ క్షమాపణలు చెప్పాలి’
రావులపాలెం: రిజర్వేషన్ల విధానంపై సమీక్ష జరగాలని జనసేన అధ్యక్షుడు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ వెంటనే ఆ వాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి డిమాండ్ చేశారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన దళిత సమావేశానికి హాజరైన ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
కారెం శివాజీ నియామకం రద్దు
-
కారెం శివాజీ నియామకం రద్దు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తీర్పు అమలు వాయిదాకు తిరస్కృతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ నియామకం విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివాజీ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఆ నియామకం చట్ట విరుద్ధమని పేర్కొంది. నియామకం ఎంతమాత్రం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగలేదంటూ తప్పుబట్టింది. ప్రభుత్వం తన ఇష్టానుసారం కావాల్సిన వ్యక్తిని నియమించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సమర్థత, నిజాయితీ ఉన్న, ఎస్సీ, ఎస్టీలకు విశిష్ట సేవలు అందించిన వ్యక్తినే సంబంధిత కమిషన్ చైర్మన్‌గా నియమించాలని తెలిపింది. నియామకంలో పారదర్శకత పాటించాలని, ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రకటనలు జారీచేసి, అర్హులైన అభ్యర్థుల పేర్లను సూచించేందుకు సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. చైర్మన్‌గా నియమించే వారికి విశిష్ట వ్యక్తులకుండాల్సిన లక్షణాలు ఉన్నాయా? లేవా? చూడాలంది. విశిష్ట వ్యక్తులు అంటే సామాన్యులకంటే అధికులే కాక, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కాబోయే వారికన్నా కూడా ఉన్నతులని హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 13న జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది జె.ప్రసాద్‌బాబు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారించారు. తీర్పు వెలువరించిన తర్వాత శివాజీ తర ఫు న్యాయవాది స్పందిస్తూ.. అప్పీల్ దాఖలు చేసేందుకు వీలుగా తీర్పు అమలును కొద్దికాలం పాటు నిలిపేయాలని కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలను కారెం శివాజీ రద్దు చేసుకున్నారు. -
ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఎన్నిక చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఆయన ఎంపిక తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆయన కేవలం మాలమహానాడు అధ్యక్షుడు మాత్రమేనని, ఆయనను ఇలాంటి కమిషన్‌కు ఎంపిక చేయడం ఏంటన్న వాదనలు వినిపించాయి. ఇంత ముఖ్యమైన నియామకం చేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చి, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని వాటిలోంచి ఎంపిక చేయాలని కోర్టు తెలిపింది. అసలు ఈ పదవికి అర్హతలు ఏంటన్న విషయంలో కూడా ఎలాంటి నిబంధనలు విధించలేదు. ఎవరి నుంచి దరఖాస్తులు తీసుకోకుండా ముఖ్యమైన పదవికి చైర్మన్‌గా నియమించడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ విషయంలో కారెం శివాజీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం హైకోర్టు కొట్టేసింది. సమర్థుడైన మరో వ్యక్తిని నియమించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో అప్పీలుకు వెళ్లడానికి సైతం అనుమతించలేదు. ఇప్పటికే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా జరిగిందని తెలిపింది. -
‘వారికి స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి’
రాజమండ్రి: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరారు. బుధవారం రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరిగిన జాతీయ దళిత సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించటంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం సదస్సులో వివిధ అంశాలపై 12 తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ఆచార్య ముత్యాలనాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య నర్సింహారావు పాల్గొన్నారు. SC, ST Rape Prevention Act, karem Shivaji, National Dalit Conference, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, కారెం శివాజీ, జాతీయ దళిత సదస్సు -
దళిత గిరిజనుల హక్కులు కాలరాస్తే దండనే
– దివంగత దామోదరం సంజీవయ్య విగ్రహావిష్కరణలో కారెం శివాజీ శ్రీశైలం ప్రాజెక్టు: భారత రాజ్యాంగంలో దళిత, గిరిజనుల కోసం పొందుపర్చిన హక్కులను ఏ అధికారి అయిన కాలరాస్తే దండన తప్పదని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ హెచ్చరించారు. సోమవారం ఆయన శ్రీశైలం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, దళిత నేత దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక రెడ్ల కల్యాణ మండపంలో దళిత, గిరిజనులతో ముఖాముఖి అయ్యారు. దళిత, గిరిజన నాయకులు పలు సమస్యలను చైర్మన్ దష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా కారెంశివాజీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా రాష్ట్రంలో ఇంకా అంటరాని తనం కనిపిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత గిరిజనులు మౌలికసదుపాయాలకు నోచుకోవడం లేదని చెప్పారు. గాడితప్పిన ఎస్సీ,ఎస్టీ కమిషన్‌పై ప్రత్యేక దషిపెట్టినట్లు తెలిపారు. ఆత్మగౌరవంగా బతకాలంటే ఆర్థికంగా ఎదగాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యాభివద్ధిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చెంచుగిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న శ్రీశైల ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించేలా కషి చేస్తానన్నారు. అటవీ భూ హక్కు చట్టం ప్రకారం భూములు పొందిన వారు వాటిని సాగుచేసుకునేలా చర్యలు తీసుకుంటానని హామీచ్చారు. అలాగే సున్నిపెంట ప్రాంతంలో కల్యాణమండపం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఐటీడీఏపీఓ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి, తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ శ్రీనివాసులు, ప్రొగ్రాం కన్వీనర్ కిరణ్‌రాజు, గిరిజన నాయకులు ఆశీర్వాదం, జెండాలమ్మ, రాములునాయక్, హుసేనాయక్, జీవులనాయక్, బీమ్లానాయక్, బద్యేనాయక్, ఎస్సీ వెల్ఫెర్ అసోసియేషన్ నాయకులు లక్ష్మయ్య, అంబేడ్కర్ న్యాయసేవా సమితి నాయకులు తులసీరామ్, దళిత జనజీవనజ్యోతి సర్వీస్ సొసైటీ నాయకులు జాకోబ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసాదరావు, మాలమహానాడు నాయకులు సీహెచ్ గాలెయ్య, మహిళా నాయకురాలు నాగలక్ష్మి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
'సంక్షేమం పట్టని ప్రభుత్వరంగ బ్యాంకులు'
► దళిత, గిరిజనుల వెనుకబాటుకు అవే కారణం ► రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ ధ్వజం కాకినాడ సిటీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మార్వాడీ వ్యవస్థను తలపిస్తూ వ్యాపారం చేస్తున్నాయే తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ విమర్శించారు. గురువారం కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత, గిరిజనుల వెనుకబాటుతనానికి ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ వ్యవస్థే కారణమన్నారు. కార్పొరేట్లకు ఇష్టానుసారం రుణాలిచ్చే ప్రభుత్వరంగ బ్యాంకులు నిరుపేద ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలను బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటూ పొట్ట కొడుతున్నాయన్నారు. బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కులవివక్ష నిర్మూలనకు కమిషన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పోలీసులు అట్రాసిటీ కేసుల విషయంలో దోషులకు కొమ్ము కాస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసు, రెవెన్యూ శాఖల ప్రక్షాళనకు కమిషన్ చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైఖరిని చెప్పాలని విలేకరులు కోరగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉందని, హోదా రాకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. విలేకరుల సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
కారెం నియామకంపై వివరణ ఇవ్వండి
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శులతో పాటు కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. అలాగే శివాజీ నియామకానికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ న్యాయవాది జె.ప్రసాద్‌బాబు, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ మంగళవారం విచారించారు. ఐక్యతతోనే మాల, మాదిగల అభివృద్ధి: రావెల సాక్షి, విజయవాడ బ్యూరో: ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగలు కలసి ముందుకు సాగితేనే అభివృద్ధి సాధిస్తామని, విడిపోతే పడిపోతామని మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. విజయవాడలో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కారెం శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇవ్వడానికి నిరాకరించే బ్యాంకర్లను జైళ్లో పెట్టించి రుణాలు ఇప్పిస్తానని చెప్పారు. కాగా, కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. -
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది
-
సోము వీర్రాజుకు ధైర్యం లేదు
కాకినాడ : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ శుక్రవారం కాకినాడలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీ ముందు మాట్లాడే ధైర్యం సోము వీర్రాజుకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసిందో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీని కారం శివాజీ డిమాండ్ చేశారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకుండా... కాలం వెళ్లదీస్తున్న బీజేపీపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలతోపాటు మాలమహానాడు కూడా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కారెం శివాజీపై విధంగా స్పందించారు. -
ఆమరణ దీక్ష చేపట్టిన కారెం శివాజీ
రాజమండ్రి రూరల్ (తూర్పుగోదావరి): దళితులను సాంఘీక బహిష్కరణకు గురిచేసిన వారిని అరెస్టు చేయాలంటూ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో ఆదివారం ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. మండలంలోని పిడంగొయి గ్రామానికి చెందిన దళితులకు, ఇతర వర్గీయులకు బీఆర్ అంబేద్కర్ విగ్రహం విషయంలో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి దళితులను వ్యవసాయ పనులకు రైతులు పిలవడం లేదు. దీంతో సాంఘీక బహిష్కరణకు గురిచేసిన వారిని అరెస్టు చేయాలంటూ మాలమహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. -
'బీజేపీ నాయకుల్ని జిల్లాల్లో తిరగనివ్వం'
కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దాటవేత వైఖరి అవలంబిస్తున్న బీజేపీ నేతలకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కారెం శివాజీ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీజేపీ నాయకులను తిరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. బలిదానాలు చేసుకోవద్దని, పోరాటాల ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ, సీపీఐ, ప్రత్యేక హోదా సమితి పోరాడుతున్నాయన్నారు. ఈ నెల 11న తలపెట్టిన బంద్‌కు సీపీఎం, టీడీపీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టులు కూడా బంద్‌లో పాల్గొనాలని కోరారు. రాజధాని నిర్మాణం కాగితాలకే పరిమితం.. రాజధాని నిర్మాణం కాగితాలకే పరిమితమైందని శివాజీ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఐదుశాతం కూడా జరగలేదన్నారు. పోలవరం, రాజధాని, పెట్రో కారిడార్, పెట్రో యూనివర్సిటీలను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని, యూనివర్సిటీలకు శంకుస్థాపనలు చేసినా ఎక్కడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే కాక రైతులకు గిట్టుబాటు ధర లేదన్నారు. తక్షణం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
'వెంకయ్యనాయుడు పూర్తిగా అధికారానికి బానిస'
కాకినాడ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిపై మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆదివారం కాకినాడలో నిప్పులు చెరిగారు. వెంకయ్యనాయుడు పూర్తిగా అధికారినికి బానిస అయ్యారని ఆరోపించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దిశలో నడుస్తున్నారని విమర్శించారు. విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదాపై మాట మార్చి వెంకయ్యనాయుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో రేపు దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కారెం శివాజీ ప్రకటించారు. -
కారెం శివాజీ నివాసంలో భారీగా నగదు స్వాధీనం
మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ నివాసంలో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి మండలం మాగంలోని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ నివాసంలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా ఆయన నివాసంలో రూ.19.56 లక్షలు పోలీసులు కనుగొన్నారు. ఆ నగదుపై శివాజీ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. అందుకు వారు మీనమేషాలు లెక్కించారు. దాంతో పోలీసులు ఆ నగదు స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
48 అసెంబ్లీ స్థానాలకు పోటీ: కారెం శివాజీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో 48 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలుపుతున్నట్లు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. సోమవారం విశాఖపట్నంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాలలంతా ఏకమై ‘మన ఓటు మనకే’ అనే నినాదంతో మాలమహానాడు అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. -
నేడు అసెంబ్లీ ముట్టడి: కారెం శివాజీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాం డ్తో సోమవారం అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్లు సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే ముట్టడిస్తామని చెప్పిన అశోక్‌బాబు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ చివరకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
'సమైక్య ఉద్యమం కొంతమంది చేతుల్లో నీరుగారింది'
సమైక్యాంధ్ర ఉద్యమం కొంతమంది చేతుల్లో నీరుగారుతుందని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు కారెం శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ... అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత మంది సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు అమ్ముడు పోయారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజాసంఘాలే భుజస్కంధాలపైకి తీసుకోవాల్సిన బాధ్యతను ఈ సందర్భంగా కారెం శివాజీ గుర్తు చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవశ్యకత ప్రజా సంఘాలకు ఉందని ఈ సందర్భంగా కారెం శివాజీ పేర్కొన్నారు. -
రాజ్యసభ సీటు కోసం ఉద్యమం తాకట్టు
అశోక్‌బాబుపై కారెం శివాజీ ధ్వజం హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజ్యసభ సీటుకోసం ఐదున్నర కోట్ల మంది నడిపిన సీమాంధ్ర ఉద్యమాన్ని ఏపీఎన్జీవోల ఆధ్యక్షుడు అశోక్‌బాబు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ తీవ్రంగా విమర్శించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీల అండ లేకుండా 130 రోజులు సమైక్యాంధ్ర ఉద్యమం నడిచిందని, అటువంటి మహా ఉద్యమాన్ని నీరుకార్చి అశోక్‌బాబు తన పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు. -
అశోక్‌బాబు వైఖరిని నిరసిస్తూ కారెం శివాజీ రాజీనామా
రాజమండ్రి: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై సమైక్య రాష్ట్రపరిరక్షణ వేదిక ఉపాధ్యక్షుడు కారెం శివాజీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్ బాబు ద్వంద్వవైఖరిని నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. అఖిలపక్షంలో దళిత సంఘాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఏపీఎన్జీవో ఎన్నికలపై ప్రభావం పడేలా అశోక్‌బాబు అఖిలపక్ష సమావేశాన్ని నామమాత్రంగా నడిపించారని శివాజీ వివర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అశోక్‌బాబు నీరుగార్చారని చెప్పారు. దళిత సంఘాలను అశోక్‌బాబు దూరం చేస్తున్నారంటా శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్‌బాబు నియంతృత్వధోరణి వల్లే.. సమైక్యాంధ్ర ఉద్యమం నుండి ఆర్టీసీ, విద్యుత్ సచివాలయ ఉద్యోగ సంఘాలు దూరమయ్యాయిని కారెం శివాజీ విమర్శించారు. -
అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు: కారెం
సాక్షి, రాజమండ్రి: ‘అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు. నీవల్లే సమైక్య ఉద్యమం నీరుగారుతోంది. నీవల్లే సమైక్య ఉద్యమానికి ప్రజా సంఘాలు దూరమవుతున్నాయి’ అని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, సమైక్య ఉద్యమ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రిలో శివాజీ విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమం పట్ల అశోక్‌బాబు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. అశోక్‌బాబు అవలంబిస్తున్న పోకడల కారణంగా ఉద్యోగులు ఉద్యమానికి దూరమవుతున్నారని చెప్పారు. ఆయన వల్లే ఎన్జీవోల నడుమ అంతర్గత విభేదాలు పెచ్చుమీరిపోయాయని, ఆధిపత్య పోరు కొనసాగుతోందని ఆరోపించారు. ఎన్జీవో నేతలు వ్యక్తిగత దూషణలతో సమైక్య ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు. -
‘టీ’ బిల్లును వెనక్కి పంపేయాలి
పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ :తెలంగాణ రాష్ట్ర బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపించేయాలని, ఒకవేళ అసెంబ్లీలో తీర్మానానికి ప్రతిపాదిస్తే సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తే రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో కాంగ్రె స్ జెండాలను తమ కార్యకర్తలు పీకిపారేస్తారని హెచ్చరించారు. పాలకొల్లులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లులో సీమాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతోపాటు, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా దానిని రూపొందించారని పేర్కొన్నా రు. రాష్ట్ర విభజనతో నీటి యుద్ధా లు జరుగుతాయని హెచ్చరించినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నా రు. 1991లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాలకోసం 13 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా, గోదావరి జలాల కోసం ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తగవులాడుకోవాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలు రాజకీయ జేఏసీగా ఏర్పడి బిల్లును వ్యతిరేకించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించి పోరాటం చేయాల్సిన అవసరం వుందన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగానే ఏపీఎన్జీవోలంతా మెరుపు సమ్మెకు సిద్ధంకావాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మైలాబత్తుల మైఖేల్‌రాజు, కోరం ముసలయ్య, రాష్ట్ర లీగల్ అడ్వయిజర్ డీకేవీ ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు వర్థనపు మోహనరావు పాల్గొన్నారు.