ఇష్టానుసారంగా నియమిస్తారా? | High Court comments on Karem Shivaji | Sakshi
Sakshi News home page

ఇష్టానుసారంగా నియమిస్తారా?

Published Tue, Nov 15 2016 1:27 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

ఇష్టానుసారంగా నియమిస్తారా? - Sakshi

ఇష్టానుసారంగా నియమిస్తారా?

కారెం శివాజీ నియామకంపై రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

 సాక్షి, హైదరాబాద్ : ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి విశిష్టవ్యక్తి అరుు ఉండాలని చట్టం చెబుతున్నప్పుడు, అందుకు విరుద్ధంగా ఇష్టానుసారం కావాల్సిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఎవరిని చైర్మన్‌గా నియమించాలన్న విషయంలో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉన్న మాట వాస్తవమే అరుునా, నియామకం మాత్రం ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని ప్రశ్నించింది. చైర్మన్ పదవికి ప్రసాద్‌బాబు అనే వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నప్పుడు అతని దరఖాస్తును పరిగణనలోకి తీసుకోకుండా, శివాజీనే చైర్మన్‌గా నియమించాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశిష్టవ్యక్తంటే సాధారణ వ్యక్తి కాదని సింగిల్ జడ్జి తన తీర్పులో పేర్కొన్నారని, ఇందులో ఎటువంటి దోషం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

అదే విధంగా ప్రజా సంబంధిత పోస్టుల నియామకం సహేతుకంగా, పారదర్శకంగా ఉండాలని కూడా సింగిల్‌జడ్జి చెప్పారని, ఇది కూడా సబబుగానే ఉందంది. సింగిల్ జడ్జి చెప్పిన అంశాలు ఏ విధంగా సరికాదో వివరించాలని కూడా ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను గురువారానికి వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌సీ, ఎస్‌టీ చైర్మన్‌గా కారెం శివాజీని నియమిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 13న జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది జె.ప్రసాద్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సుదీర్ఘ విచారణ చేపట్టిన జస్టిస్ రామచంద్రరావు గతవారం తీర్పునిస్తూ కారెం శివాజీ నియామకాన్ని రద్దు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు కారెం శివాజీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement