కమిషన్ చైర్మన్ పునర్నియామకానికి ప్రభుత్వం పోరాటం
Published Mon, Jan 30 2017 12:28 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
– సామాజిక మాద్యమల్లో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు
– ఎస్పీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వమే తనను కుట్రపన్ని దింపినట్లు సామాజిక మాద్యమాల్లో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. నియాయక ప్రక్రియలో చోటుచేసుకున్న కొన్ని సాంకేతిక కారణాలతో పదిహేను రోజుల క్రితం హైకోర్టు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసినట్లు వివరించారు. ఆదివారం కర్నూలు స్టేట్ గెస్టు హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రభుత్వం కూడా కమిషన్‌ను తిరిగి నియమించడం కోసం హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసిందన్నారు. తాను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న అతికొద్ది కాలంలోనే దళిత, గిరిజనుల అనేక సమస్యలను పరిష్కరించానని తెలిపారు. జనవరి 30 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దళిత, గిరిజనులను ఐక్యం చేసేందుకు పర్యటిస్తున్నట్లు చెప్పారు. మాలమహానాడు నాయకులు నల్లన్న, దేవన్న, జనార్దన్, లక్ష్మీనారాయణ, మునిస్వామి, బాలాజీ పాల్గొన్నారు.
Advertisement