సాక్షి, పశ్చిమగోదావరి: రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగమైన ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడం దురదుష్టకరమని ఎస్సీ, ఎస్టీ మాజీ చైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైస్సార్సీపీని టార్గెట్ చేస్తూ వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. కక్ష సాధింపు చర్యలతో బలవంతంగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న నిమ్మగడ్డది ముమ్మాటికీ బ్లాక్ మెయిల్ విధానమే అన్నారు. నిమ్మగడ్డవి నీతి మాలిన పనులంటూ దుయ్యబట్టారు. గెలుపు ఓటముల గురించి నిమ్మగడ్డకు ఎందుకని ప్రశ్నించారు. తరచూ కోర్టు మెట్లు ఎక్కడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు ఉందిని.. నిమ్మగడ్డ ప్రతిపక్ష పాత్ర మానుకుంటే మంచిదని శివాజీ సూచించారు. (కావాలనే ఘర్షణ వైఖరి)
Comments
Please login to add a commentAdd a comment