హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాం డ్‌తో సోమవారం అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్లు సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే ముట్టడిస్తామని చెప్పిన అశోక్‌బాబు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ చివరకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.