‘దళితులకు పవన్ క్షమాపణలు చెప్పాలి’
Published Fri, Nov 11 2016 1:02 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
రావులపాలెం: రిజర్వేషన్ల విధానంపై సమీక్ష జరగాలని జనసేన అధ్యక్షుడు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ వెంటనే ఆ వాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి డిమాండ్ చేశారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన దళిత సమావేశానికి హాజరైన ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Advertisement
Advertisement