రాజ్యసభ సీటుకోసం ఐదున్నర కోట్ల మంది నడిపిన సీమాంధ్ర ఉద్యమాన్ని ఏపీఎన్‌జీవోల ఆధ్యక్షుడు అశోక్‌బాబు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ తీవ్రంగా విమర్శించారు.
అశోక్‌బాబుపై కారెం శివాజీ ధ్వజం
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజ్యసభ సీటుకోసం ఐదున్నర కోట్ల మంది నడిపిన సీమాంధ్ర ఉద్యమాన్ని ఏపీఎన్‌జీవోల ఆధ్యక్షుడు అశోక్‌బాబు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ తీవ్రంగా విమర్శించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీల అండ లేకుండా 130 రోజులు సమైక్యాంధ్ర ఉద్యమం నడిచిందని, అటువంటి మహా ఉద్యమాన్ని నీరుకార్చి అశోక్‌బాబు తన పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు.