
సోము వీర్రాజుకు ధైర్యం లేదు
కాకినాడ : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ శుక్రవారం కాకినాడలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీ ముందు మాట్లాడే ధైర్యం సోము వీర్రాజుకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసిందో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీని కారం శివాజీ డిమాండ్ చేశారు.
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకుండా... కాలం వెళ్లదీస్తున్న బీజేపీపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలతోపాటు మాలమహానాడు కూడా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కారెం శివాజీపై విధంగా స్పందించారు.