
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో చిచ్చురేపిన సంస్థాగత పదవుల భర్తీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవడంతో కినుక వహించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎట్టకేలకు చల్లబడ్డారు. అజ్ఞాతం నుంచే సోమవారం రాత్రి ఒక కీలక ప్రకటన చేశారు. దీంతో రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన సోము వర్గం నేతలు పునరాలోచనలో పడ్డారు.
‘‘అధిష్ఠానం ఎంపికను అందరూ సమర్థించాల్సిందే. పార్టీ నిర్ణయమే అంతిమం కాబట్టి దానికి అందరూ కట్టుబడి ఉండాలి. పెద్దల నిర్ణయాన్ని పార్టీ నాయకులుగానీ, కార్యకర్తలుగానీ వ్యతిరేకించవద్దు..’’ అంటూ సోము వీర్రాజు పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదలైంది.
(బీజేపీలో ముసలం.. అజ్ఞాతంలోకి సోము వీర్రాజు!)