
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశే మా టార్గెట్ అని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఆమేరకు సంస్థాగత మార్పులు చేసింది. అనూహ్యరీతిలో కన్నా లక్ష్మీనారాయరణకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవీబాధ్యతలు కట్టబెట్టింది. ఈ మేరకు ఆదివారం బీజేపీ హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
వీర్రాజుకు కీలక పదవి: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు సైతం పార్టీలో కీలక పదవి దక్కింది. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారనే పేరున్న సోముకే అధ్యక్ష పదవి దక్కుతుందని, దీంతో అలక వహించిన కన్నా పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
నమ్మకాన్ని నిలబెడతా: కన్నా
తనకు కీలక పదవి దక్కడంపై కన్నా లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడతానని, అమిత్ షా, నరేంద్ర మోదీల నమ్మకాన్ని నిలబెడతానని మీడియాతో కన్నా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment