అశోక్‌బాబు వైఖరిని నిరసిస్తూ కారెం శివాజీ రాజీనామా
రాజమండ్రి: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై సమైక్య రాష్ట్రపరిరక్షణ వేదిక ఉపాధ్యక్షుడు కారెం శివాజీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్ బాబు ద్వంద్వవైఖరిని నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. అఖిలపక్షంలో దళిత సంఘాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఏపీఎన్జీవో ఎన్నికలపై ప్రభావం పడేలా అశోక్‌బాబు అఖిలపక్ష సమావేశాన్ని నామమాత్రంగా నడిపించారని శివాజీ వివర్శించారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అశోక్‌బాబు నీరుగార్చారని చెప్పారు. దళిత సంఘాలను అశోక్‌బాబు దూరం చేస్తున్నారంటా శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్‌బాబు నియంతృత్వధోరణి వల్లే.. సమైక్యాంధ్ర ఉద్యమం నుండి ఆర్టీసీ, విద్యుత్ సచివాలయ ఉద్యోగ సంఘాలు దూరమయ్యాయిని కారెం శివాజీ విమర్శించారు.