సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని చంద్రబాబుకి నిద్ర పట్టడం లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు.. 420 అశోక్ బాబు ఇంటికి వెళ్లి మాపై రుబాబు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఘీంకరిస్తున్నాడు. అశోక్ బాబు అనే వ్యక్తి ఒక 420 పనిచేశాడు. అది రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. తప్పుడు సర్టిఫికెట్‌తో పదోన్నతి పొందారని పిర్యాదు అందింది.
ఆ ఫిర్యాదును లోకాయుక్త విచారణ చేసి సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దానిని విచారించి అది నిజమే అని నిర్దారణ చేశాక అరెస్ట్ చేశారు. దీన్ని నిన్నటి నుంచి చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేస్తోంది. దీనికి సీఎం జగన్‌కు ఏమి సంబంధం. అసలు ఆయన చేసిన పనిని ఎవరు సమర్థిస్తారు..?. మీరు చేసింది 420 పని అని చంద్రబాబుకి అర్థం కావడం లేదా. ఎవర్ని బెదిరిస్తావ్.. ఇక్కడ ఎవ్వరూ బెదిరిపోరు.
చదవండి: (టీడీపీ నాయకుల బూతుపురాణం.. వాట్సాప్‌లో వైరల్)
చంద్రబాబు నిద్రపోవట్లేదు.. నిద్రపోడు కూడా. 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆయనకి నిద్ర పట్టదు. నువ్వు ఎవ్వరి గుండెల్లో నిద్రపోలేవు చంద్రబాబు.. ఇక్కడెవరూ భయపడరు. ఇక్కడ ఉన్నది ఒక ధీశాలి నాయకత్వంలో పనిచేస్తున్న కోదమ సింహాలు. నువ్వు ఎన్ని దొంగ ఏడుపులు ఏడ్చినా 25 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉంటారు. అప్పులు అంటున్నాడు.. తెచ్చిన అప్పులు మీలా దోచుకోలేదు. ప్రతి పైసాకి మా దగ్గర లెక్క ఉంది.. ప్రతి ఇంటికి ఆ డబ్బు చేరింది. అభివృద్ది ఒకచోటే కావాలా..? అమరావతిలోనే అభివృద్ది చేయాలా..?. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ది కావాలని తపించే వ్యక్తి జగన్. సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్నది జగన్.
చదవండి: (‘అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’)
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నావ్...మళ్లీ తెరిచిన పుస్తకంగా నిలబెట్టిన వ్యక్తి జగన్. ప్రధాని మోదీ నోటి వెంట విభజన వల్ల ఏపీ నష్టపోయింది అంటూ వచ్చిన మాటలు జగన్ పోరాటం వల్లే. ఈ రోజు సబ్ కమిటీ అజెండాలో చేర్చి చర్చించేలా చేసింది జగన్. ఇది జగన్ విజయం. ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ మరుగున పడదు. తెరిచిన పుస్తకంలా ఉంచిన జగన్‌కి ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటివి మరుగున పెట్టాలని 420 అశోక్ బాబు వివాదాలను తెస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ.. మీలా చేవ చచ్చిన పార్టీ కాదు. మీకు దమ్ముంటే ప్రజా సమస్యలపై పోరాడండి. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టాలనే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు. ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ మాట్లాడుకుంటున్నాం అంటే అది మేము చేసిన పోరాటమే. తప్పనిసరిగా దీనిపై చర్చ జరుగుతుంది. మనకు మంచి జరిగే రోజు వస్తుంది. అది ఒక్క జగన్‌మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment