
కారెం శివాజీ నివాసంలో భారీగా నగదు స్వాధీనం
మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ నివాసంలో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి మండలం మాగంలోని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ నివాసంలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా ఆయన నివాసంలో రూ.19.56 లక్షలు పోలీసులు కనుగొన్నారు.
ఆ నగదుపై శివాజీ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. అందుకు వారు మీనమేషాలు లెక్కించారు. దాంతో పోలీసులు ఆ నగదు స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.