వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ శ్రేణులు | TDP cadres join to ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ శ్రేణులు

Published Sat, Mar 5 2016 1:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ శ్రేణులు - Sakshi

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ శ్రేణులు

ఎమ్మెల్యే పీఆర్కే సమక్షంలో పార్టీలో చేరిన యువకులు

మాచర్ల: రెంటచింతలకు చెందిన రైలుపేట, ఆంజనేయస్వామి మాణ్యానికి చెందిన 75 మంది టీడీపీ సభ్యులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యులు మోర్తాల ఉమామహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ ఎమ్మెల్యే పీఆర్కే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంతమంది నాయకులు పోయినా నష్టమేమీ లేదని, బలమైన కార్యకర్తలు,వైఎస్సార్‌ అభిమానులు ఉన్న వైఎస్సార్‌సీపీ బలహీనపడే ప్రసక్తే లేదన్నారు. ప్రలోభాలకు గురయ్యే నాయకులు మినహా ప్రజలంతా వైఎస్సార్‌సీపీకే మద్దతు పలుకుతున్నారని ఎమ్మెల్యే పీఆర్కే చెప్పారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. పార్టీలో చేరిన దవిశెట్టి శ్రీనివాసరావు, షేక్ గౌస్, షేక్‌వలి, చింతపల్లి శివ, రాములు, జక్కల శ్రీను, గుదె రాములు, బాలు, సాగర్, దండే శ్రీనివాసరావు, రాముడు, పుల్లా ఫ్రాన్సిస్, మహేష్, అశోక్, మహేష్‌నాయుడు, మందపాటి చినశ్రీను, వేముల కళ్యాణ్, నంబూరి రాముడుతోపాటు పలువురు యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ పూజల రామయ్య, ఏరువ శౌరెడ్డి, సర్పంచ్ గుర్రాల రాజు, ఏలూరి సత్యం, ఎంపీటీసీ రామాంజనేయరెడ్డి, జిల్లా కార్యదర్శి జూలకంటి వీరారెడ్డి, యూత్ కన్వీనర్ తురకా కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement