ఎమ్మెల్యే పీఆర్కేకు మైలేజీ..
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం
బహిరంగ చర్చ నుంచి యరపతినేని తప్పించుకున్న తీరుపై సర్వత్రా విమర్శలు
మాచర్ల : పల్నాడులో తీవ్ర ఉత్కంఠ రేపిన సవాళ్లు, ప్రతి సవాళ్ల వ్యవహారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిష్టను పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయానికి వచ్చారు. పోలీసుల సహాయంతో ఛాలెంజ్‌కు వెనుకంజ వేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. రెండు వారాల కిందట యరపతినేని అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తిన పీఆర్కేకి ప్రతి సవాల్ విసిరి, దేనికైనా సిద్ధమని చెప్పి యరపతినేని సోమవారం పీఆర్కేను హౌస్ అరెస్టు చేయించిన అనంతరం పిడుగురాళ్లలో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తనపై పోటీ చేయమని సవాల్ విసిరానని చెప్పడం ద్వారా ప్రస్తుతం ఉప ఎన్నికలకు తాను సిద్ధం కాదని స్పష్టం చేశారని, తద్వారా ఛాలెంజ్‌కు వెనుకంజ వేశారని పలువురు చెప్పుకుంటున్నారు. ఆధారాలు తీసుకు రావాలని వేదిక, తేదీ చెప్పిన యరపతినేని తీరా అసలు సమయానికి ఏదో సాకుచెప్పి పోలీసులను అడ్డంపెట్టుకుని శాంతి భద్రతల పేరుతో చర్చా వేదిక జరగకుండా తప్పించుకున్నారని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. చర్చ జరిగితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే పక్కా ప్రణాళికతో పీఆర్కే ముందస్తుగా అరెస్టులు చేయించేందుకు యరపతినేని నానా తంటాలు పడ్డారు. ఇప్పటి వరకు దాచేపల్లిలోని పేకాట క్లబ్ నిర్వహణ, రేషన్ అక్రమ వ్యాపారం గురించి ఎక్కడా మాట్లాడకపోవడం గమనిస్తే వీటిలో ఆయన పాత్ర ఉండడం వల్లే మాట్లాడడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఉన్నా కేవలం సరస్వతి భూములకు సంబంధించి తమకు అనుకూలంగా ఉన్న కొంత మంది చేత మాట్లాడించి అనుకూల మీyì యాలో వివిధ కథనాలు రాయించుకుని, తన హవా చాటుకోవాలని ప్రయత్నం చేసినా, చివరికి చర్చ జరుగకుండా బయటపడేందుకు యరపతినేని నానా తంటాలు పడ్డారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో పీఆర్కే తాను చేసిన సవాల్‌కు చివరి వరకు నిలబడి ఆధారాలతో నిరుపించేందుకు సిద్ధమై ప్రజల మెప్పు పొందగా, యరపతినేని మాత్రం కుంటి సాకులతో వెనుకంజ వేసి డ్యామేజ్ అయ్యారని సర్వత్రా చర్చ జరుగుతోంది.