టీడీపీ ఆగడాలను ఎండగడతా..
వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పీఆర్కే
మాచర్ల: అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అవకాశం వస్తే పల్నాడులో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, మాఫియా ఆగడాలు, అక్రమాల తీరుపై ప్రస్తావిస్తానని వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. పల్నాడులో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులను అడ్డంపెట్టుకొని చేస్తున్న అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా మాట్లాడతానన్నారు. ప్రత్యేకహోదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అధికార పార్టీ వారు రాజీపడి సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ప్రజలను మోసగిస్తున్న విధానాన్ని ఎండగడతానన్నారు.