సాగర్‌ కుడికాలువకు నీరు విడుదల చేయాలి | MLA PRk's demands release water to Sagar right canal | Sakshi
Sakshi News home page

సాగర్‌ కుడికాలువకు నీరు విడుదల చేయాలి

Published Fri, Aug 19 2016 5:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

MLA PRk's demands release water to Sagar right canal

ఎమ్మెల్యే పీఆర్కే 
 
మాచర్ల : నాగార్జున సాగర్‌ కుడికాలువ పరిధిలోని రైతుల పంటలను కాపాడేందుకు నీటి విడుదలను కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. హైదరాబాద్‌ నుంచి ఆయన గురువారం రాత్రి ఆయన సాక్షితో ఫోన్లో మాట్లాడారు. రెండేళ్లుగా సాగర్‌ కుyì lకాలువ రైతులు నీటి కొరతతో పంటలు సరిగా పండించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి నెలకొన్నందున సాగర్‌ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరిగిందన్నారు. ఇప్పటికీ సాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కృష్ణా బోర్డు అధికారులతో చర్చించి కుడికాలువ పరిధిలోని రైతులకు పంట నీరు అందించాలని ఆయన కోరారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement