బోర్ల తవ్వకానికి శంకుస్థాపన
Published Sat, Jul 30 2016 6:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
సొంత నిధులు రూ.5 లక్షలతో బోర్ల ఏర్పాటు
మాచర్ల: పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం సొంత ఖర్చుతో ఐదుబోర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నా.. అందులో భాగంగానే గురువారం రాత్రి చెన్నకేశవకాలనీలో బోర్ వేయించా, 7, 9 వార్డులలో బోర్లు తవ్విస్తున్నాం.. మరో మూడుచోట్ల బోర్లు వేయాల్సి ఉందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం వివిధ ప్రాంతాలలో మంచినీటి బోర్ల తవ్వకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చినమాట ప్రకారం రూ.5 లక్షలు వెచ్చించి శివారు కాలనీలో బోర్లు తవ్విస్తున్నామని చెప్పారు. 9వ వార్డులో బోరు తవ్వకం పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ 9వ వార్డుకు చెందిన కృష్ణబలిజ సంఘం నాయకులు పండ్ల అంజిబాబు, ఆంజనేయులు, శ్రీనివాసరావు, జి.హనుమంతరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్ కరిముల్లా, మరియమ్మ, మెట్టు శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బోయ రఘురామిరెడ్డి, షేక్ కరిముల్లా పాల్గొన్నారు.
సాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలి..
మంచినీటి అవసరాల కోసం రెండువారాలకుపైగా సాగర్ కుడికాలువకు ప్రభుత్వం నీటిని విడుదల చేయటానికి అంగీకరించటం వల్ల మంచినీటి సమస్య పరిష్కారం లభించినట్లయిందని ఎమ్మెల్యే పీఆర్కే అన్నారు. పురపాలక అధికారులు భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తకుండా ఎక్కువ మోటార్లతో ఈ 15 రోజుల వ్యవధిలో క్వారీని నింపితే నీటిఎద్దడి సమస్య తలెత్తే అవకాశం లేదన్నారు.
Advertisement