లక్నో: ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (యూపీఐటీఎస్) నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇది సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకకూ కొనసాగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో నేడు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది తదితరులు హాజరుకానున్నారు.
ఈ ప్రదర్శనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియా ఎక్స్‌పొజిషన్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలో 2500కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 70 దేశాల నుంచి దాదాపు 500 మంది విదేశీ కొనుగోలుదారులు ఈ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను సందర్శించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన ఉండనుంది.
'वैश्विक व्यापार का महाकुंभ'
Uttar Pradesh International Trade Show के द्वितीय संस्करण का उद्घाटन आज माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी के कर कमलों से सम्पन्न होगा।
कार्यक्रम में #UPCM श्री @myogiadityanath जी की भी गरिमामयी उपस्थिति रहेगी।
दिनांक: 25 सितंबर 2024
समय:… pic.twitter.com/wAk8ZggvqN— Government of UP (@UPGovt) September 25, 2024
గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరిగిన ప్రీ-ఈవెంట్ బ్రీఫింగ్‌లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) మంత్రి రాకేష్ సచన్ మాట్లాడుతూ ఈ ఏడాది ట్రేడ్ ఫెయిర్ గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు. యూపీ ఆర్థికాభివృద్ధికి యూపీఐటీఎస్ చిహ్నంగా మారిందని సచన్ తెలిపారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన కొత్త ఫోను సంబురం
Comments
Please login to add a commentAdd a comment