జాతీయ స్థాయి ప్రదర్శనలో ‘హెల్మెట్‌పై వైపర్’
త్రిపురారం : మండలంలోని దుగ్గెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంక్రాంతి సానియా న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన ఇన్‌స్పైర్ మనక్ జాతీయ స్థాయిలో ప్రదర్శనలో బైక్ హెల్మెట్‌పై వైపర్ ఎగ్‌బిట్‌ను ప్రదర్శించింది. దీంతో మంగళవారం దుగ్గెపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు సోనియాను సన్మానించి అభినందించారు. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన గైడ్ టీచర్ ముదిరెడ్డి రాంరెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బాబు, దశరథరాం, శ్రీలత, సోమయ్య, రాంరెడ్డి, మియాజాని, అసీఫ్ అలీ, కనక మహాలక్ష్మి, కరుణాకర్‌రెడ్డి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఈ నెల 17,18 తేదీల్లో ఢిల్లీలో ప్రదర్శన
ఫ విద్యార్థినికి ఉపాధ్యాయుల సన్మానం
Comments
Please login to add a commentAdd a comment