టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
Published Sat, Oct 15 2016 9:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
గుంటూరు స్పోర్ట్స్: డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియం, జిల్లా టెన్నిస్ సంఘం, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో అండర్–14, 16 బాలబాలికల టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. తొలుత అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు క్రీడాకారులను పరిచయం చేసుకొని టెన్నిస్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి చారి, న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, రాష్ట్ర పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ సంఘం కార్యదర్శి సంగీతరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement