ఎస్సీ వర్గీకరణకు రిలే దీక్ష ప్రారంభం
Published Sun, Aug 7 2016 7:27 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
గుంటూరు ఎడ్యుకేషన్: ఎస్సీ వర్గీకరణ జరపాలని డిమాండ్ చేస్తూ మాదిగ ఉద్యోగ సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాదిగ ఉద్యోగ సమాఖ్య ఉపాధ్యక్షుడు దాసరి నాగయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరపాలని మంద కృష్ణమాదిగ నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 17 రోజులుగా జరుగుతున్న దీక్షలకు మద్దతుగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. రిజర్వేషన్ ఫలాలను పొందడంలో మాదిగలు ఎంతో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
మహా ధర్నాకు తరలివెళ్లాలి..
ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాకు మాదిగ ఉద్యోగులు వారి కుటుంబాలతో తరలిరావాలని సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మురికిపూడి దేవపాల్ పిలుపునిచ్చారు. రిలే దీక్షలో మాదిగ ఉద్యోగ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు వంగూరి అశోక్, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు జి.నాగరాజు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కూచిపూడి రామారావు, నగర అధ్యక్షుడు కువ్వారపు మనోహర్‌బాబు, బిరుదు పాపయ్య, జి.రాంబాబు, విజయబాబు, ఎంఆర్‌పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు చలివేంద్రం వెంకటేశ్వర్లు, ప్రేమానందం, రావెల వరప్రసాద్, మాదిగ యువసేన జిల్లా మాజీ అధ్యక్షుడు కొమ్మూరి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement