
సాక్షి, విజయవాడ: ఎస్సీలకు సామాజిక న్యాయం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేలు చేకూర్చిందని బీజేపీ రాష్ట్ర కో ఇంచార్జ్ సునీల్ థియోధర్ పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాల వారు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీని బాగా విశ్వసించారు. కానీ, కాంగ్రెస్ వారిని మోసం చేసిందని వ్యాఖ్యానించారు.బీజేపీ రానున్న ఐదేళ్లలో బలపడుతుందనీ, ఎస్సీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తుందని ఆయన విశ్లేషించారు. కుల, మతాలకు అతీతంగా మోదీ ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వివాస్ పేరుతో ఆదరిస్తుందని, గ్రామగ్రామాన పార్టీని తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్కా సునీల్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment