
సాక్షి, విజయవాడ: పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నారని, ఆ కలల్ని మానుకోవాలని విమర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి. గోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ గెలిస్తే పవన్ పార్టీ మూసేసుకొని వెళ్తావా? అంటూ సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము పవన్‌కి ఉందా? అంటూ చాలెంజ్ చేశారు.
ఎమ్మెల్యే కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత పవన్‌కి లేదని, ఒక్కచోట గెలవని వాడు, సవాల్ విసురుతుంటే నవ్వొస్తుందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మమ్ముల్ని ఓడించడం కాదు.. ముందు అభ్యర్థుల్ని వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేస్తున్న జగనన్నపై ఈర్ష్యపు మాటలు ఆపకపోతే పవన్ కళ్యాణ్‌కి తగిన బుద్ధి చెబుతామని వెల్లంపల్లి హెచ్చరించారు.