
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వ పాలనలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కంటుపడిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని పశ్చిమ నియోజవర్గంలో బుధవారం మంత్రి పర్యటించారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యాక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రూ. 2కోట్లతో రోడ్లు, కొండ ప్రాంతంలోమెట్లు, రిజర్నింగ్ వాల్స్ నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టేలా పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ క్రమంలో నగర అభివృద్ధికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ణతలు తెలిపారు.
ఇక టీడీపీ పాలనలో పచ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి అన్నారు. త్రాగు నీరు, వర్షపునీరు రోడ్లపై నిల్వ లేకుండా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మండలి రద్దు అడ్డుకుంటామంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుచ నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కన్నాలక్ష్మీ నారాయణ వ్యాఖ్యాలను ఖండిస్తున్నామన్నారు. పవన్, కన్నా, చంద్రబాబు వ్యాఖ్యాలతో వీరి రాజకీయ ముసుగు తొలగిపోయిందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోలేరన్నారు. సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజల మద్దతు ఉందని, విశాఖ పట్నం పజలు ఓడించారనే కక్షతో పవన్ కల్యాణ్ వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని మంత్రి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment