ఓపెన్‌ చెస్‌ పోటీలు ప్రారంభం | Open chess competition begin | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ చెస్‌ పోటీలు ప్రారంభం

Published Sun, Sep 4 2016 8:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

ఓపెన్‌ చెస్‌ పోటీలు ప్రారంభం

ఓపెన్‌ చెస్‌ పోటీలు ప్రారంభం

గుంటూరు స్పోర్ట్స్‌: వెనిగండ్ల విలేజి చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అరండల్‌పేటలోని జిల్లా  గ్రంథాలయంలో కె.శ్రావణి మెమోరియల్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. టోర్నమెంట్‌లో 50 మంది రేటెడ్‌ క్రీడాకారులతో పాటు మొత్తం 90 మంది చెస్‌ క్రీడాకారులు  పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు చెస్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెస్‌ మేధోశక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. చెస్‌లో రాణించే క్రీడాకారులు చదువుల్లోను రాణిస్తారని చెప్పారు. టోర్నమెంట్‌ నిర్వహకుడు కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రూ.7వేలు నగదు బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శిక్షకులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement