బాలికల సాఫ్ట్‌బాల్ విజేత అనంత జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్:
అండర్–17 బాలికల సాఫ్ట్‌బాల్ పోటీల్లో అనంత బాలికల జట్టు విజేతగా నిలించింది. విజయనగరం జట్టుపై 5–0తో గెలుపొందింది. అండర్–17 విభాగంలో గుంటూరు జట్టు ( 4–2తో) ప్రథమ స్థానంలో నిలవగా, అనంత జట్టు ద్వితీయ స్థానం పొందింది. అండర్–14 విభాగంలో అనంత బాలుర జట్టు మూడవ స్థానాన్ని దక్కించుకుంది. అండర్–14 బాలికల విభాగంలో అనంత జట్టు విజయనగరం జట్టు చేతిలో 3–0తో ఓటమి పాలవడంతో రెండవ స్థానానికి చేరింది. మూడు రోజులుగా సాగుతున్న సాఫ్ట్‌బాల్ పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. అనంతరం జాతీయస్థాయిలో పాల్గోనే రాష్ట్రస్థాయి అండర్–14, అండర్–17 బాల, బాలికల జట్లను ఎంపిక చేశారు.
క్రీడల ద్వారా ఉన్నత స్థానం..
క్రీడల ద్వారా ఉన్నతమైన స్థానానికి చేరవచ్చునని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 62వ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ క్రీడా ముగింపు కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ అధ్యక్షుడు అంజయ్య, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గెలుపోటములు సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. క్రీడలు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయన్నారు. రాష్ట్ర సాఫ్ట్‌బాల్ కార్యదర్శి వెంకటేశులు, స్కూల్‌గేమ్స్ కార్యదర్శి నారాయణ, జిల్లా సాఫ్ట్‌బాల్ అధ్యక్షుడు నాగరాజు, రాష్ట్ర అబ్జర్వర్లు సత్యనారాయణ, చంద్రశేఖర్, పీఈటీ ల సంఘం నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
అండర్–14 రాష్ట్ర బాలికల జట్టు వివరాలు : లావణ్య, మిస్సీ, సాయి (విజయనగరం), కోమలి (పశ్చిమ గోదావరి), చంద్రిక, మాధవి, దుర్గ, గౌతమి (అనంతపురం), దీపిక, రాజకుళ్లాయమ్మ (కడప), గౌతమి, నాగలక్ష్మి (కృష్ణా), వరలక్ష్మి (విశాఖ), అఖిల (చిత్తూరు), షాఫియా (కర్నూలు), సత్యనారాయణమ్మ (తూర్పు గోదావరి),
స్టాండ్ బైస్ – సుజాత (నెల్లూరు), లిఖిత (శ్రీకాకుళం), పవిత్ర (అనంతపురం), హారిక (గుంటూరు).
అండర్–14 రాష్ట్ర బాలుర జట్టు : శివ, మంజునాథ్, మణికంఠ, పైడిరాజు, భూషణ (విజయనగరం), వెంకట బాలాజి, శ్రీనివాసరావు, వెంకటేష్ (గుంటూరు), శర్మాస్‌వలి, మహబూబ్‌బాష (అనంతపురం), మహేష్, అప్పన్న (శ్రీకాకుళం), ఖాదర్ (నెల్లూరు), నాగబాబు (తూర్పు గోదావరి), నవీన్ (కడప)
స్టాండ్ బైస్ – మనోజ్ (కర్నూలు), లోకేష్, చిన్నారావు (చిత్తూరు), నరేష్ (ప్రకాశం)
అండర్–17 రాష్ట్ర బాలుర జట్టు : ఫృథ్వీ, శివ, శ్రీనివాసులు, రాము (అనంతపురం), శ్రీధర్‌బాబు, శ్రీనివాస్, గోపి, కృష్ణ, టి.శ్రీనివాస్ (గుంటూరు), మణికంఠ, శివ (విజయనగరం), అనిల్‌కుమార్ (కడప), ఆకాశ్, నాగమల్లేశ్వరరావు (కృష్ణా), భానుతేజ (చిత్తూరు), శ్రీను (శ్రీకాకుళం), పవన్ (ప్రకాశం), సుభాష్‌చంద్రబోస్ (చిత్తూరు)
స్టాండ్ బైస్ – సత్యరావు (విజయనగరం), తేజ (నెల్లూరు), జగదీష్ (విశాఖ), నరేష్ (శ్రీకాకుళం)
అండర్–17 రాష్ట్ర బాలికల జట్టు
లావణ్య, మనీషా, జయశ్రీ, సుష్మా (అనంతపురం), గౌతమి, రాజేశ్వరి, పవిత్ర (విజయనగరం), శోభ (చిత్తూరు), సుప్రజ, విమోచన (కర్నూలు), గంగోత్రి, జాస్మిత (కడప), నాగమణి (నెల్లూరు), త్రివేణి (ప్రకాశం), కీర్తి (గుంటూరు)
స్టాండ్ బైస్ – సుధామణి (విజయనగరం), మమత (అనంతపురం), మనీషా (కృష్ణా), ప్రియాంక (గుంటూరు), ఓంశ్రీ (చిత్తూరు)